Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు ఇరుక్కుంటున్నారా ?

Kalvakuntla Kavitha In Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పీకల్లోతులో ఇరుక్కుంటున్నారా ? గతంలో కనిమొళి లాగే కల్వకుంట్ల కవితకు కూడా లీగల్ ట్రబుల్స్ తప్పవా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2022, 10:29 AM IST
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం
  • సమీర్ మహేంద్రు ఈడి చార్జ్ షీట్‌లో కవిత పేరు
  • కవితకు సంబంధించిన అనేక విషయాలు ప్రస్తావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
Kalvakuntla Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు ఇరుక్కుంటున్నారా ?

Kalvakuntla Kavitha In Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జ్‌షీట్‌లోకి ఎక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ మహేంద్రు కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం... సమీర్ మహేంద్రుతో కవిత ఫేస్‌టైమ్‌లో రెండు సార్లు, హైదరాబాద్‌లో ఒకసారి ప్రత్యక్షంగా కలిసినట్టు తెలుస్తోంది. 

ఇండో స్పిరిట్స్ ముందుండి నడిపించేది రామచంద్ర పిళ్లై కాగా.. ఎమ్మెల్సీ కవిత వెనుక ఉండి నడిపిస్తారని సమీర్ మహేంద్రు వెల్లడించినట్టుగా ఛార్జ్ షీట్‌లో ఈడీ ప్రస్తావించింది. ఇండో స్పిరిట్స్‌లో నిజమైన పార్టనర్స్ కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత ఉపయోగించిన 10 సెల్ ఫోన్లను సాక్ష్యాధారాలు లేకుండా ధ్వంసం చేశారని సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది.

సమీర్ మహేంద్రు ఛార్జ్ షీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరుతో పాటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, మూత్తం గౌతమ్, అరుణ్ రామచంద్ర పిళ్ళై, అభిషేక్ రావు, దినేష్ అరోరా, విజయ్ నాయర్ పేర్లను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రముఖంగా ప్రస్తావించింది. శరత్ చంద్రా రెడ్డి మేనేజ్ చేస్తోన్న 5 రిటైల్ జోన్ల వ్యాపారాన్ని బోయినపల్లి అభిషేక్ రావు నడిపిస్తున్నట్టు ఈడీ చార్జ్ షీట్‌లో స్పష్టంచేసింది. ఇండో స్పిరిట్స్ కాంట్రాక్టులో భాగంగా ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారని సమీర్ మహేంద్రు తమ విచారణలో వెల్లడించారని ఈడీ అభిప్రాయపడింది.

BRS-MLC-Kalvakuntla-Kavitha-name-In-Delhi-Liquor-Scam-Case.jpg

శరత్ చంద్రా రెడ్డి, బోయినపల్లి అభిషేక్, బుచ్చిబాబు ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో సమీర్ మహేంద్రును కలిసినట్టు ఈడీ ఛార్జ్ షీట్‌లో ప్రస్తావించింది. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో భేటీ అనంతరం ఆ నలుగురు కలిసి శరత్ చంద్రా రెడ్డికి సంబంధించిన చార్టెడ్ ఫ్లైట్‌లోనే హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణమైనట్టు ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొనడం గమనార్హం. ఇండో స్పీరిట్స్‌లో ఎల్ 1 కింద వచ్చిన షాపుల్లో కల్వకుంట్ల కవితకు వాటా ఉందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Delhi Liquor Scam: నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం.. కవితకు రాజగోపాల్ రెడ్డి రిప్లై

ఇది కూడా చదవండి : MLC Kavitha: ఆ మాటలు నన్ను బాధించాయి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్సీ కవిత

ఇది కూడా చదవండి : CRPC 91: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం, కవితకు షాక్, మళ్లీ సీబీఐ నోటీసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News