Chennakesava Reddy Re Release: Sensational Pre bookings in USA heading towards ALL TIME RECORD for a rerelease: గతంలో సూపర్ హిట్ గా నిలిచిన పలు హీరోల సినిమాలను ఆయా హీరోల పుట్టినరోజు లేదా సినిమా వార్షికోత్సవం సందర్భంగా సినిమా రీ రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, తమ్ముడు, ఒక్కడు, పోకిరి వంటి సినిమాలను రీ రిలీజ్ చేసిన నిర్మాతలు ఇప్పుడు బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా 20 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మరోసారి సినిమానే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ చేస్తామని చెప్పారో అప్పటి నుంచి నందమూరి అభిమానులు సినిమా కోసం చాలా ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. గతంలో రీ రిలీజ్ విషయంలో వచ్చిన అన్ని రికార్డులను బద్దలు కొట్టేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో మొత్తం 31 చోట్ల ఈ సినిమా విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాతిక వేల డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జల్సా సినిమా విషయానికి వస్తే ఈ కలెక్షన్లు 37 వేల డాలర్లుగా ఉంది.
అయితే ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే చెన్నకేశవరెడ్డి సినిమా రికార్డు బద్దలు కొట్టడం పెద్ద విషయమేమీ కాదు అంటున్నారు. 2002వ సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తేదీన వివి వినాయక్ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా విడుదలైంది. టబూ- శ్రియ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు. అప్పట్లో ఈ సినిమా హిట్ అనిపించుకోలేదు కానీ సినిమా మాత్రం బాగానే ఉందని ఇప్పటికీ చూసిన వారందరూ చెబుతూ ఉంటారు.
ఇక ఈ సినిమా రీ రిలీజ్ అవుతూ ఉండడంతో సినిమా గత రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. అమెరికా విషయానికి వస్తే ప్రస్తుతానికి 25 వేల డాలర్ల దాకా సంపాదించిందని సుమారు 1860 టికెట్లు దాకా అమ్ముడు అయ్యాయని అంటున్నారు. మొత్తం 35 లొకేషన్ లలో 55 షోలు వేస్తున్నారని తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఆదివారం నాడు ప్లాన్ చేసిన స్పెషల్ షోస్ లో 524 టికెట్లు అమ్ముడు అయ్యాయి అని తెలుస్తోంది. అభిమానులు అయితే రీ రిలీజ్ విషయంలో ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలు కొట్టబోతుందనే విషయం క్లారిటీ వచ్చేసింది అని అంటున్నారు.
Also Read: Venkatesh Maha with Nani: లవ్ స్టోరీ చెప్పిన వెంకటేష్.. డైలమాలో నాని?
Also Read: Thaar Maar Thakkar Maar : తార్ మార్ టక్కర్ మార్ వచ్చేసింది.. మెగా ఫాన్స్ కు పూనకాలే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.