Urvashi rautela apology to saif ali khan on her comments: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై ఇటీవల ముంబైలో ఆయన నివాసంలో దుండగులు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయనకు ఇప్పటికే రెండు సర్జరీలు జరిగాయి. వెన్నుపాములో ఉన్న కత్తిని తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. సైఫ్ ను ఐసీయూ నుంచి నార్మల్ వార్డ్ కు షిఫ్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సైఫ్ పై దాడి ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీఐపీలు ఉండే బాంద్రాలో ఇలాంటి ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
#WATCH | Mumbai: On the attack on actor #SaifAliKhan, actor Urvashi Rautela says, "...It is very unfortunate...This creates an insecurity that anybody can attack us. What happened is very unfortunate...All my prayers are with them (Saif Ali Khan and his family)." pic.twitter.com/fcLtGsWSvG
— ANI (@ANI) January 16, 2025
మెగా స్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సైతం దీనిపై స్పందించారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు ఘటనపై ప్రత్యేక బృందాలను పోలీసుల్ని రంగంలోకి దింపారు. ఇదిలా ఉండగా.. డాకు మహారాజ్ బ్యూటీ నటి ఊర్వశి రౌతేలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వివాదానికి దారితీశాయి. దీనిలో జాతీయా మీడియా ప్రతినిధి .. సైఫ్ పై దాడి ఘటనపై ఏమంటారని.. ఎలా స్పందిస్తారని అడిగారు. అయితే.. డాకు మహారాజ్ మూవీ సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుతూ.. తాను నటించిన డాకు మహారాజ్ రూ.105 కోట్ల వసూళ్లతో మంచి విజయం సాధించిందన్నారు.
మా అమ్మ నాకు డైమండ్ ఉంగరం గిప్ట్ గా ఇచ్చిందని, మా నాన్న.. ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను కానుకగా ఇచ్చారన్నారు. అయితే, ప్రస్తుతం వాటిని ధరించి బయటకు వెళ్లడం భయంగా ఉందంటూ ఆమె మాట్లాడారు. దీంతో అక్కడున్న వారంత షాక్ అయ్యారు. ఇక్కడ సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన కన్నా.. కూడా.. ఎక్కడ డైమండ్, ఆభరణాలు వేసుకొని వెళ్తే.. ఎవరైన దోచుకుంటారో అనే దాన్ని ప్రయారిటీగా ఆమె మాట్లాడారు.
ఒక నటుడిపై దాడి సమయంలో కూడా.. ఆమె కాస్లీ వస్తువులే ముఖ్యమన్నట్లు మాట్లాడారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. కష్ట సమయంలో ఒకరికి అండగా ఉండాల్సిన సమయంలో ఇలా మాట్లాడానని.. నటి తన మాటలకు సిగ్గుపడుతున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.
Read more: Daaku Maharaaj: డాకు మహారాజ్ అభిమానులకు బిగ్ షాక్.. ఐదుగురు అరెస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?
మనస్పూర్తిగా తాను చేసిన పనికి సైఫ్‌కు క్షమాపణలు చెబుతూ.. మీరు తొందరగా కొలుకొవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు నటి చెప్పుకొచ్చారు. అంతటి కష్ట సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్యం చాలా గొప్పదంటూ కూడా.. నటి ఊర్వశి రౌతేలా ఇన్ స్టాలో పొస్ట్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter