Dil Raju Loss : శాకుంతలంతో దిల్ రాజు అన్ని కోట్లు పోగొట్టుకున్నాడా?.. అలా వచ్చి ఇలా పోతోన్నట్టున్నాయ్!

Samantha Shaakuntalam Movie దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా టాలీవుడ్‌లో తన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే అందరి దృష్టి పడుతుంది. ఆయన జడ్జ్మెంట్ మీద జనాలకు ఇంకా నమ్మకం ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 01:24 PM IST
  • నెట్టింట్లో దిల్ రాజుపై చర్చలు
  • శాకుంతలంతో ఎన్నికోట్ల నష్టమంటే?
  • ఒకదాంట్లో వస్తే ఇంకో దాంట్లో పోతోన్నాయ్!
Dil Raju Loss : శాకుంతలంతో దిల్ రాజు అన్ని కోట్లు పోగొట్టుకున్నాడా?.. అలా వచ్చి ఇలా పోతోన్నట్టున్నాయ్!

Dil Raju Loss దిల్ రాజు ఇప్పుడు సినిమాలు నిర్మిస్తూనో, డిస్ట్రిబ్యూట్ చేస్తూనే బిజీగా ఉంటున్నాడు. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. దాదాపుగా రెండేళ్లుగా సమంత ఫ్యాన్స్ తో పాటు తెలుగు తమిళ సినీ ప్రేమికులను ఊరించిన శాకుంతలం సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యి తీవ్రంగా నిరాశ పర్చింది. వంద కోట్ల వసూళ్లు టార్గెట్ తో రూపొంది దేశ వ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమాకు రెండు అంకెల కోట్ల షేర్‌ కూడా రాలేదు అనేది బాక్సాఫీస్ వర్గాల టాక్‌.

ఇక ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న దిల్ రాజుకు దెబ్బ పడింది. మరీ ఇంత దారుణంగా వసూళ్లు ఉంటాయని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. సమంత గత చిత్రం యశోద కి వచ్చిన కలెక్షన్స్ తో పోల్చితే శాకుంతలంకు వచ్చిన కలెక్షన్స్ అతి తక్కువ. శాకుంతలం సినిమా తో దర్శక నిర్మాత గుణశేఖర్‌ తో పాటు దిల్‌ రాజు భారీగా నష్టపోయినట్లుగా సమాచారం అందుతోంది. 

మొదట శాకుంతలం సినిమా సమర్పకుడిగా మాత్రమే దిల్ రాజు వ్యవహరించాలని భావించాడు. కానీ సినిమాపై ఆ తర్వాత నమ్మకం కలగడంతో భారీ మొత్తంలో పెట్టబడి పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శాకుంతలం సినిమా కారణంగా దిల్ రాజు ఏకంగా రూ.22 కోట్ల రూపాయలను నష్టపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. దిల్‌ రాజు ఈ స్థాయిలో నష్టపోతే సినిమాకు ఒరిజినల్‌ నిర్మాత అయిన గుణశేఖర్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ తన పాతికేళ్ల సినీ ప్రస్థానంలో అతి పెద్ద నష్టం శాకుంతలం కే వచ్చిందని అన్నాడట. సాధారణంగా దిల్ రాజు సినిమాలను నిర్మించి ఫ్లాప్ అయినా కూడా థియేట్రికల్‌ రైట్స్ ద్వారా కొద్ది మొత్తం నాన్ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా కొద్ది మొత్తంలో రాబట్టే అవకాశం ఉంటుంది. కనుక నష్టం భారీగా ఉండదు. కానీ దిల్ రాజు ఈ సినిమా పంపిణీ హక్కుల కోసం భారీ మొత్తంను ఖర్చు చేయడం జరిగింది. అయితే థియేటర్లలో ఈ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది. ఇతర రైట్స్ ద్వారా ఈయనకు వచ్చేది ఏమీ లేదట. 

Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్

అందుకే ఏకంగా రూ.22 కోట్ల రూపాయలను దిల్ రాజు నష్టపోయి ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు ఇంత గుడ్డిగా శాకుంతలం సినిమాను ఎలా నమ్మాడో అర్థం కావడం లేదు అంటూ చాలా మంది ఇప్పటికి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం శాకుంతలం సినిమా విషయంలో దిల్‌ రాజు మోసపోయిన తీరు గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కొందరు దిల్ రాజు పెట్టింది ఏమీ లేదని అంటున్నారు. కానీ ఆయన 22 కోట్ల రూపాయలకు నష్టపోయాడు అనేది చాలా మంది వాదన. అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దసరా, బలగంతో వచ్చినవ్నీ శాకుంతలంతో పోయినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు విరూపాక్షతో బాగానే వస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News