Jeevitha Rajasekhar Apology: సినీ నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ ఆర్యవైశ్య సామాజికవర్గానికి క్షమాపణలు చెప్పారు. హీరో రాజశేఖర్ లేటెస్ట్ మూవీ 'శేఖర్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జీవిత రాజశేఖర్ కాకతాళీయంగా చేసిన వ్యాఖ్యలు ఆర్యవైశ్య సామాజికవర్గాన్ని బాధించాయి. తన కూతురు శివానిని ఉద్దేశించి మాట్లాడుతున్న క్రమంలో.. 'స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ బాగా లేకపోతే... వాళ్లు తిరిగి డబ్బులు ఇచ్చేదాకా వదలదు.. ఆ అమ్మాయి కోమటిదాని లెక్క' అంటూ జీవిత నోరు జారారు. దీనిపై ఆర్యవైశ్య సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో జీవిత రాజశేఖర్ క్షమాపణ చెప్పక తప్పలేదు.హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో గురువారం (మే 19) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జీవిత మాట్లాడారు.
ఆర్యవైశ్యులు డబ్బుకు చాలా విలువ ఇస్తారని... ఒకరకంగా వాళ్ల గొప్పతనాన్ని చెప్పేలా చేసిన వ్యాఖ్యలు మరో రకంగా ప్రచారమయ్యాయని జీవిత రాజశేఖర్ పేర్కొన్నారు. అందరం ఒక్కటేనని... ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం లేదని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే అందుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ విషయం ఇంత పెద్దది అవుతుందనుకుంటే అదే ప్రీరిలీజ్ ఈవెంట్లో దీనిపై మాట్లాడి ఉండేదాన్ని అన్నారు.
ఇక ఇదే ప్రెస్ మీట్లో జీవిత రాజశేఖర్ మరికొన్ని విషయాలు ప్రస్తావించారు. తామెప్పుడూ ఎవరినీ మోసం చేసింది లేదని.. అయినప్పటికీ తనపై వచ్చినన్ని వార్తలు ఇంకెవరిపై రావని అన్నారు. ఇటీవల తమ ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్ టూర్ వెళ్తే.. తన కూతురు లేచిపోయిందని మీడియాలో ప్రచారం జరిగిందని వాపోయారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే జీవితాలు ప్రభావితమవుతాయని అన్నారు.
రాజశేఖర్ దంపతులు గరుడ వేగ సినిమా విషయంలో రూ.26 కోట్లు మోసం చేశారంటూ ఆ సినిమా నిర్మాతలు ఇటీవల చేసిన ఆరోపణలను జీవిత రాజశేఖర్ తోసిపుచ్చారు. ఆ సినిమాకు వచ్చిన ప్రతీ పైసా నిర్మాతలు కోటేశ్వరరావు, హేమ తీసుకున్నారని చెప్పారు. నిర్మాతలుగా ఆ సినిమాకు వారు సగం ఖర్చు పెడితే... మిగతా సగం తాము ఆస్తులమ్మి ఖర్చు పెట్టామన్నారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న వివాదం ఎటూ తేలకముందు మీడియా ముందుకొచ్చి తమపై ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టారు.
Also Read: Navjot Singh Sidhu: నవజ్యోత్ సింగ్ సిద్ధూకి బిగ్ షాక్... ఏడాది జైలు శిక్ష విధించిన సుప్రీం కోర్టు...
Also Read: KA Paul Comments: చంద్రబాబులా డబ్బులు పట్టుకొని పారిపోను! కేఏ పాల్ సంచలన కామెంట్లు..
Also Read: స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook