Game Changer Piracy: సినిమా అంటే వేలాది మంది శ్రమతో కూడుకున్నది. ఎంతో మంది పగలు రాత్రి కష్టపడితే కానీ ఓ సినిమా పూర్తి కాదు. అందులో నిర్మాత, దర్శకుడు, హీరో నుంచి లైట్ బాయ్, ఆఫీస్ బాయ్ వరకు ప్రతి ఒక్కరి కష్టము దాగుటుంది. అలా కష్టపడి తెరకెక్కించిన సినిమా ఇలా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడమే ఆలస్యం.. పైరసీ దారులు ఆ సినిమాకు సంబంధించిన హెచ్ డీ ప్రింట్ ను ఏకంగా నెట్ లో పెడుతున్నారు. అంతేకాదు నెట్ లో పెట్టిన సినిమాను తీసేయాలంటే కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగిన ఈ పైరసీ దారులను కట్టడి చేయలేకపోతుంది సినీ పరిశ్రమ.
ఇక కొంత మంది హీరోల అభిమానులు.. వేరే హీరోలకు సంబంధించిన ఈ పైరసీ ప్రింట్స్ ను వేరే గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఓ హీరో అభిమానులు.. మరో హీరో సినిమాను ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. అందుకు తమకు గిట్టని హీరోల సినిమాల పైరసీని ఎంకరేజ్ చేస్తూ సినీ పరిశ్రమకు తీరని ద్రోహం చేస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు పైరసీ ఎంకరేజ్ చేయడంలో అందరి హీరోల అభిమానుల భాగస్వామ్యం ఉందని చెప్పాలి.
తాజాగా రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన రోజే.. ఈ సినిమాకు సంబంధించిన హెచ్ డి ప్రింట్ నెట్ లో ప్రత్యక్షమైంది. కొన్ని చోట్ల ఏకంగా లోకల్ టీవీలో పాటు ట్రావెల్ బస్సుల్లో ఈ సినిమాను ప్రసారం చేయడం కలకలం రేపింది. ఏపీలో విశాఖలో గేమ్ చేంజర్ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ చేసి ఆ సినిమాను ఏపీ లోకల్ టీవీలో ప్రసారం చేశారు. దీనిపై చిత్ర నిర్మాతలు, టీమ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి విశాఖపట్టణం కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో మేనేజింగ్ డైరెక్టర్ హెచ్.వి.చలపతిరాజు అండ్ టీంతో పాటు గాజువాక పోలీస్ అండ్ క్రైమ్ క్లూస్ టీమ్.. అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ లోకల్ టీవీపై ఏపీ దాడులు నిర్వహించింది. గేమ్ ఛేంజర్ తెలుగు సినిమా పైరసీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు మరియు ఎఫ్ఐఆర్ (22/2025) నమోదు చేసి అరెస్టు చేశారు. గేమ్ చేంజర్ మూవీ నిన్నటితో వారం రోజులు థియేట్రికల్ రన్ ముగిసింది. దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.