Gopireddy Challenge to Balakrishna: ఏపీలో అధికార పక్షానికి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యేకి టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో తన సినిమా పాటలు తొలగించాలని నరసరావుపేట ఎమ్మెల్యే చెప్పడం సరి కాదని రాజకీయాలకు సినిమాలకు ముడి పెట్ట వద్దు అని అంటూ కామెంట్లు చేశారు. రాజకీయాలను రాజకీయాల్లాగానే చూడాలి, సినిమాలను సినిమాల్లాగానే చూడాలని, మరోసారి ఇటువంటి ఘటనలు జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నాతో పెట్టుకోకు నేను మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో తెలుసుకో అంటూ బాలకృష్ణ ఘాటు వార్నింగ్ ఇచ్చారు.
తన సినిమాల జోలికి వస్తే వ్యవహారం వేరేగా ఉంటుందని బాలకృష్ణ వార్నింగ్ ఇవ్వగా ఈ అంశం మీద ఇప్పుడు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి స్పందించారు. ఈ విషయంలో బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్న ఆయన సినీనటుడు బాలకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. ఏదో ఒకటి మాట్లాడటం తప్పైపోయింది అని వెనక్కి తీసుకోవడం బాలకృష్ణకు అలవాటని ఆయన అన్నారు. ఇదంతా కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభ ఏర్పాటు విషయంలో తలెత్తిన ఘటన అని, తిరునాళ్లలో ప్రభ ఏర్పాటు కోసం భాస్కర్ రెడ్డి చందాలు వసూలు చేశాడని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నరసరావు పేటలో కూడా చందాలు వసూలు చేసి ప్రభ కట్టాడని, అయితే ప్రభను తిరునాళ్లకు కూడా తీసుకెళ్లకుండా మధ్యలోనే నిలిపివేశాడని అన్నారు. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి విషయంలోనూ న్యూసెన్సు చేస్తుంటాడని, చందాలిచ్చిన వారు కూడా నాకు అతనిపై ఫిర్యాదులు చేశారని అన్నారు. ఆ విషయంలో అతన్ని అంటే మీకేం ఇబ్బంది అని ఆయన ప్రశ్నించారు. మాకు వార్నింగ్ ఇవ్వడానికి మీరెవరు బాలకృష్ణ అని ప్రశ్నించిన ఆయన మా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడడానికి మీకేం పని అని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలన్న ఆయన నువ్వు హీరోవైతే మీ టీడీపీకి గొప్ప నాకు కాదని అన్నారు.
అసలు అయినా మా నియోజకవర్గంలో జరిగిన విషయం పై స్పందించడానికి మీరెవరు? ఏదైనా మాట్లాడే ముందు వ్యక్తుల గురించి తెలుసుకోవాలని అన్నారు. బాలకృష్ణకు ఇదే నా సవాల్, జరిగిన సంఘటన పై చర్చించేందుకు నేను సిద్ధం అని గోపిరెడ్డి అన్నారు. ఓ పనికిమాలిని వెధవకు వత్తాసు పలికి బాలకృష్ణ దిగజారొద్దన్న గోపిరెడ్డి మనుషులకు మూడోకన్ను ఉండదు కదా బాలకృష్ణ కూడా మనిషే కదా అని ఎద్దేవా చేశారు. సినిమాల్లో మాదిరి నటన రాజకీయాల్లో కుదరదని బాలకృష్ణ తెలుసుకోవాలని గోపిరెడ్డి అన్నారు.
Also Read: Optical Illusion: ఈ ఫోటోలో మూడు గుడ్లగూబలు ఉన్నాయి.. 10 సెకన్లలో కనుక్కుంటే తోపులే..ట్రై చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook