సూపర్ హిట్ గీత గోవిందం పాటకు తమిళ్ టచ్ అదుర్స్ కదా!!

ఇంటర్నెట్‌లో తమిళ టచ్‌తో అలరిస్తున్న ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాట

Last Updated : Sep 20, 2018, 07:24 PM IST
సూపర్ హిట్ గీత గోవిందం పాటకు తమిళ్ టచ్ అదుర్స్ కదా!!

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన గీత గోవిందం సినిమాలో ఇంకేం ఇంకేం కావాలే పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియోలోని ప్రతీ పాట యంగ్ ఆడియెన్స్‌ని ఒక ఊపు ఊపేసింది. ఇంకా ఊపేస్తోంది కూడా. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, కన్నడ నటి రష్మిక మంధన్న జంటగా నటించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంది. తాజాగా ఈ సినిమాలోని ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే అనే పాటకు తమిళ లిరిక్స్‌తో కూడిన తమిళ్ కవర్ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ఆదిత్య మ్యూజిక్ పోస్ట్ చేసిన ఈ తమిళ్ లిరికల్ కవర్‌కి అప్పుడే మంచి స్పందన కూడా కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ ''ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.. ఇదయం కొరిక్కాదే''పై ఓ లుక్కేసేయండి.

Trending News