నటుల కన్నా నటీమణులకు ఎక్కువగా ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందులో మీ పెళ్లెప్పుడు అని బ్యాచ్‌లర్‌గా ఉన్నప్పుడు వినేపించే ప్రశ్న. పెళ్లి తర్వాత పిల్లల్ని ఎప్పుడు కంటారు, ప్లాన్ చేసుకున్నారా లేదా ప్రశ్నలు అడిగి విసిగిస్తుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చిట్‌చాట్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అక్కినేని వారి కోడలు నటి సమంత ఊహించని సమాధానం ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు సమంత మామూలుది కాదు బాబోయ్ అంటున్నారు. Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
నాగ చైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారని తెలిసిందే. అయితే తాజాగా ఆస్క్ మి సమంతలో.. మీరు ఇప్పుడు గర్భవతా (Is Samantha Pregnant) అని ఓ నెటిజన్ అడిగాడు. ‘అవును నేను 2017 నుంచి గర్భవతి (Samantha Pregnant)నే. ఎందుకోగానీ బేబీ బయటకు రావడం లేదంటూ’ తనదైనశైలిలో నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది నటి సమంత. Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి
Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ
పిల్లలు పుట్టాక సినిమాలకు దూరంగా ఉంటానని ఒకానొక సమయంలో నటి సమంత చెప్పడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. సమంత తల్లి అయితే సినిమాలకు దూరం అవుతుందని కొందరు బాధపడుతుంటే.. తమ అభిమాన నటీనటులు తల్లిదండ్రులు ఎప్పుడవుతారా శుభవార్త ఎప్పుడు వింటామా అని ఎదురుచూస్తున్న వారి సంఖ్య తక్కువేమీ ఉండదు.
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు