Dil Raju: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలుపెట్టిన దిల్ రాజు, నిర్మాతగా మారి పలు చిత్రాల నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్ తో గేమ్ చేంజర్ సినిమాను నిర్మించారు. అలాగే మరొకవైపు వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా నిర్మించడం జరిగింది. దీనికి తోడు నైజాం ఏరియాలో బాలకృష్ణ నటించిన డాకుమహారాజ్ సినిమా హక్కులను కూడా కొనుగోలు చేశారు.
అయితే ఇదిలా ఉండగా తాజాగా ఐటి అధికారులు దిల్ రాజుకు షాక్ ఇచ్చారు. దిల్ రాజుతోపాటు శిరీష్, అలాగే దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డి ఇళ్లల్లో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న ఆయన నివాసం, కార్యాలయాలపై దాడి చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున ఏకకాలంలో దిల్ రాజు ఆఫీస్, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అసలు కారణం ఏంటి అనే విషయానికి వస్తే. సంక్రాంతికి దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్టుగా నిలిచింది. రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా దిల్ రాజు నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో విస్తరించింది కూడా.. మరొకవైపు గేమ్ చేంజర్ డిజాస్టర్ ద్వారా డిజాస్టర్ టాక్ అందుకున్న విషయం తెలిసిందే. అయినా సరే ఏకకాలంలో రెండు భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా ఈ సినిమాలో భారీ మొత్తంలో కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్లు కూడా విడుదల చేశారు.
ఈ నేపథ్యంలోనే ఐటి అధికారులు దిల్ రాజు ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిస్థితి విషయానికి వస్తే.. సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాలలో పెట్టబడులు ఆదాయం పైన ఆరా తీస్తున్నారు ఇక దిల్ రాజు భార్యను ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్లారని, ఆయన భార్య తేజశ్వినిని బ్యాంకుకు తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: SVSN Varma: పవన్ కల్యాణ్ పోస్టుకు 'పిఠాపురం గండం'.. నారా లోకేశ్‌కు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ జై!
Also Read: Amit Shah: అంబేడ్కర్ వ్యాఖ్యల చిచ్చు.. ఆంధ్రప్రదేశ్‌లో అమిత్ షాకు ఘోర పరాభవం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.