Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా భారీ అంచనాల.. మధ్య జూన్ 27న విడుదల కి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులందరూ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో మాత్రమే కాక.. ఈ సినిమా పలు భారతీయ భాషల్లో.. విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న..ఈ సినిమాలో దిశా పటాని, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటి నటులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్.. ఈ సినిమాలో విలన్ పాత్ర లో కనిపించబోతున్నారు. ట్రైలర్ లోనే కమల్ హాసన్ పాత్ర ఎలా ఉండబోతోంది.. అనే విషయంపై అభిమానులకి క్లారిటీ వచ్చేసింది.
ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి.. పాత్రలో కమల్ హాసన్ ను ఈ సినిమాలో చూడడానికి.. అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగు, తమిళ్ ప్రేక్షకులకి మాత్రమే కాకుండా కమల్ హసన్.. మిగతా ఇండస్ట్రీలలో వారికి కూడా సుపరిచితులే. ఇప్పటిదాకా 200 కు పైగా సినిమాల్లో నటించిన కమల్ హాసన్ తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో నటించారు.
కేవలం నటించడం మాత్రమే.. కాకుండా భాషలను కూడా నేర్చుకున్నారు. మాతృభాష తమిళ్ అయినప్పటికీ మిగతా భాషల్లో కూడా ప్రావీణ్యం ఉన్న కమల్ హసన్.. అద్భుతంగా డైలాగ్ డెలివరీ కూడా ఇవ్వగలరు. ఈ విషయాన్ని కల్కి సినిమాతో.. మరొకసారి నిరూపించుకున్నారు కమల్ హాసన్.
సినిమా విడుదలవుతున్న.. అన్ని భాషల్లోనూ కమల్ హాసన్ తన పాత్రకి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్లో.. కమల్ హాసన్ ది ఒక డైలాగ్ ఉంటుంది. అన్ని భాషల్లోనూ.. ఈ డైలాగ్ ని పెట్టి ఒక వీడియో తయారు చేసి.. అభిమానులు కమల్ హాసన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఐదు భాషల్లోనూ కమల్ హాసన్ భాషలకు.. తగ్గట్టుగా తన వాయిస్ మోడ్యుయేషన్ కూడా మార్చి డైలాగులు చెప్పడం నిజంగా గొప్ప విషయం అని నెటిజన్లు సైతం కమల్ హాసన్ గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.
Thats Kamal Haasan 🔥
Dubbed in all Languages 👌 Voice Modulation 👏
— Christopher Kanagaraj (@Chrissuccess) June 22, 2024
Also read: Karate Kalyani: కరాటే కల్యాణి హల్చల్.. రోడ్డుపై భీష్మించుకుని కూర్చున్న నటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook