Nirupam Paritala - Premi Viswanath : కార్తీకదీపం సెట్లో వంటలక్క చేసే పనులివేనా?.. డెడికేషన్ అంటే డాక్టర్ బాబుదే

Karthika Deepam Set కార్తీకదీపం సెట్లో డాక్టర్ బాబు, వంటలక్క సందడి చేస్తున్నారు. నెక్ట్స్ సీన్ ఏంటని డాక్టర్ బాబు ఆలోచిస్తుంటే.. తాపీగా వంటలక్క కూర్చుని కాఫీ తాగేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2022, 10:37 AM IST
  • కార్తీక దీపం సీరియల్ సందడి
  • వంటలక్కపై డాక్టర్ బాబు పోస్ట్
  • నిరుపమ్ పరిటాల మామూలోడు కాదు
Nirupam Paritala - Premi Viswanath : కార్తీకదీపం సెట్లో వంటలక్క చేసే పనులివేనా?.. డెడికేషన్ అంటే డాక్టర్ బాబుదే

Nirupam Paritala - Premi Viswanath : బుల్లితెరపై కార్తీకదీపం ఒక సంచలనం. టీఆర్పీల్లో కార్తీకదీపం కింగ్‌లా ఉండేది. అయితే కార్తీకదీపం సీరియల్‌కు వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు ప్రాణంగా మారాయి.మధ్యలో ఈ పాత్రలను లేపేశారు. కథన మార్చేశారు. దాంతో టీఆర్పీలు దారుణంగా పడిపోయాయి. మళ్లీ దర్శక నిర్మాతలంతా కలిసి.. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలను బతికించారు.

తిరిగి కథను వెనక్కి తిప్పారు. కానీ టీఆర్పీలు మాత్రం పెరగడం లేదు. వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు తిరిగి రావడంతో సీరియల్ పరిస్థితి అంతో ఇంతో మారింది. కానీ మునుపటిలా మాత్రం సీరియల్ టాప్ రేటింగ్‌తో దూసుకుపోవడం లేదు. డాక్టర్ బాబుగా నిరుపమ్‌కు, వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్‌కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ వీరివల్లే నడుస్తోందని అందరికీ తెలిసిందే.

అయితే వీరిద్దరూ ఆన్ స్క్రీన్ ఎంత బాగా సందడి చేస్తుంటారో.. ఆఫ్‌ స్క్రీన్‌లోనూ అంతే సందడి చేస్తుంటారు. ఆన్ సెట్, ఆఫ్ సెట్‌లో జరిగే విషయాలను అప్పుడప్పుడు నిరుపమ్ షేర్ చేస్తుంటాడు. సెట్‌లో తాము చేసే పనుల గురించి చెబుతుంటాడు. మామూలుగా అయితే నిరుపమ్ తన కార్తీక దీపం సెట్లో ఎక్కువ ఫోటోలకు పోజులు ఇస్తుంటాడు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ..  అదిరిపోయే ప్రాసలతో కామెంట్లు పెడుతుంటాడు.

 

తాజాగా నిరుపమ్ కార్తీక దీపం సెట్లోని స్టిల్స్‌ను షేర్ చేశాడు. అందులో తాను సీన్లకు సంబంధించిన పేపర్ కాపీలను పట్టుకుని చదువుతుంటుంటే.. ప్రేమీ విశ్వనాథ్ మాత్రం కాఫీ తాగుతూ చిల్ అవుతోంది. దీని మీద నిరుపమ్ సెటైర్ వేశాడు. ప్రాసతో కొట్టేశాడు. ఈ ప్రాసకు జనాలు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక్కడ చేతిలో స్క్రిప్ట్ కాపీ.. అక్కడేమో కప్‌లో కాఫీ.. ఇక్కడ డెడికేషన్.. అక్కడ రిలాక్సేషన్.. అని చెప్పడం నా ఉద్దేశం కాదు అని కౌంటర్ వేశాడు. కెమెరా ముందు ఇద్దరూ చేస్తారు యాక్షన్ అని మానస్.. ఎప్పటిలానే క్యాప్షన్ అదరగొట్టేశావ్ అని సాయి కిరణ్ అనేశాడు. మొత్తానికి ఈ పోస్ట్ మాత్రం అందరినీ ఇట్టే ఆకట్టుకుంటోంది.

Also Read : Chinmayi Sripada Twin Babies : పిల్లలకి పాలు పడుతున్న చిన్మయి.. ఆనందంలో తేలిపోతోన్న సింగర్

Also Read : Bigg Boss 6 Telugu 7th Week Nomination : మాటలతో దెబ్బ మీద దెబ్బ కొడుతున్న గీతూ.. హర్టైన బాలాదిత్య.. నామినేషన్ లిస్ట్ ఇదే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News