నెంబర్ 1 లో 'భరత్ అనే నేను'.. అభిమానులకు థాంక్స్ చెప్పిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ ఈ లిరికల్ సాంగ్‌కి మరింత బూస్టింగ్ అందించింది.

Last Updated : Mar 26, 2018, 05:26 PM IST
నెంబర్ 1 లో 'భరత్ అనే నేను'.. అభిమానులకు థాంక్స్ చెప్పిన మహేష్ బాబు

కొరటాల శివ డైరెక్షన్‌‌లో మహేష్ బాబు హీరోగా రూపొందిన భరత్ అనే నేను సినిమా ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ఎదురుచూస్తోన్న సినిమాల్లో ఒకటి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందుకు నిదర్శనం ఇదే అన్నట్టుగా మార్చి 24న రిలీజైన భరత్ అనే నేను సినిమా లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ లిరికల్ సాంగ్ రిలీజై ఇంకా 48 గంటలు కూడా గడవకముందే 3.3 మిలియన్స్‌కి పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. భరత్ అనే నేను లిరికల్ సాంగ్‌కి అభిమానుల నుంచి వస్తోన్న అద్భుతమైన స్పందన చూసి ఆనందం వ్యక్తంచేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. పాటను ఆదరిస్తున్న అభిమానులకు, ఆ పాట అంత గొప్పగా రావడానికి కృషి చేసిన గేయ రచయిత హరి రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ కంపోజర్ దేవీ శ్రీ ప్రసాద్, డైరెక్టర్ కొరటాల శివకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ ఈ లిరికల్ సాంగ్‌కి మరింత బూస్టింగ్ అందించింది. డేవిడ్ సైమన్ పాడిన ఈ పాటను భరత్ అనే నేను మ్యూజిక్ పార్టనర్ లహరి/టి.సిరీస్ యూట్యూబ్ ఛానెల్ అధికారికంగా ఆన్‌లైన్‌లోకి విడుదల చేసింది. ఒకవేళ మీరు ఇంకా ఈ సాంగ్‌ని చూడనట్టయితే, ఇంకెందుకు ఆలస్యం.. ఇదిగో ఈ కింది వీడియోపై మీరూ ఓ లుక్కేసేయండి!

 

Trending News