Megastar Chiranjeevi Tension to Brahmastra Movie unit: కొన్నాళ్ల క్రితం వరకు తెలుగులో ఎలా అయితే ఒక హిట్ సినిమా కూడా పడలేదని తెలుగు సినీ మేకర్స్ బాధపడ్డారో ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. తెలుగులో ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు హిట్ అందుకున్నాయి కానీ బాలీవుడ్ లో ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా మీద బాలీవుడ్ ద్రుష్టి అంతా ఉంది.
ఈ సినిమా హిందీ భాషలోనే కాక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, షారుఖ్ ఖాన్, నాగార్జున, మౌని రాయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ చూసినట్లయితే చాలా బాగున్నాయి. ప్రస్తుతానికి అన్ని భాషల్లో కలిపి 1,30,000 టికెట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన 83 సినిమా అడ్వాన్స్ బుకింగ్ టికెట్లను ఈ సినిమా అధిగమించింది.
సెప్టెంబర్ 7 అర్ధరాత్రి 12 గంటల వరకు 1,30,000 టికెట్లు అమ్ముడయ్యాయి. శుక్ర, శని, ఆదివారానికి గాను రెండున్నర లక్షల టికెట్లు అమ్ముడు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ తెలుగులో ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ మధ్య చిరంజీవి నటించిన సినిమా ఆచార్య దారుణమైన ఫలితం అందుకుంది.
అలాగే చిరంజీవి కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై ప్రమోట్ చేసిన సినిమాలు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు కానీ ఒక్కటి కూడా సరిగా వర్కౌట్ అవలేదు. ముందుగా చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సన్నాఫ్ ఇండియా ఎలాంటి ఫలితాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆయన ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరైన పక్కా కమర్షియల్, మిషన్ ఇంపాజిబుల్ అదే విధంగా ఇటీవల విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా దాదాపు అదే ఫలితాన్ని అందుకున్నాయి.
అలాగే ఆయన ప్రమోట్ చేసి సమ్పరించి విడుదల చేసిన లాల్ సింగ్ చద్దా కూడా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమా మీదటెన్షన్ నెలకొంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనే విషయం మీద చర్చ జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకి బాయ్ కాట్ భయం కూడా పట్టుకుంది.
గతంలో రణబీర్ కపూర్ తాను అన్నిటికంటే బీఫ్ ఎక్కువగా ఇష్టపడి తింటానని పేర్కొనడంతో అతన్ని ఉజ్జయిని మహంకాళి ఆలయంలోకి కూడా ఎంటర్ కానివ్వలేదు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు. అయితే ఈ బాయ్ కాట్ ట్రెండ్ గురించి రణబీర్ మాట్లాడుతూ సినిమాలు బాగోలేక పోతేనే ఇబ్బంది పడతాం తప్ప ఇలాంటి బాయ్ కాట్ ట్రెండ్స్ సినిమా బావుంటే పెద్దగా ఏమీ ప్రభావం చూపవని చెబుతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాలుగు బడా ప్రొడక్షన్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి.
Also Read: Chiranjeevi - Pawan Kalyan: ఒకే స్టేజ్‌పై చిరంజీవి, పవన్ కల్యాణ్.. అభిమానులకు పండగే ఇగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి