Thandel Hilesso Hilessa Lyrical: చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటిస్తూన్న మూడో చిత్రం ‘తండేల్’. ఇందులో ప్రేమమ్ సక్సెస్ అందుకుంటే.. ‘సవ్యసాచి’ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా ఇపుడు ముచ్చటగా మూడోసారి ‘తండేల్’ మూవీతో రాబోతున్నారు వీళ్లిద్దరు. ఈ చిత్రాన్ని చందూ మొండేటి లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. మొదటి రెండు పాటలు బుజ్జి తల్లి, నమో నమః శివాయ కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సాను లిరికల్ వీడియోను విడుదల చేశారు.
హైలెస్సో హైలెస్సా సాంగ్ చైతూ, సాయి పల్లవిల మధ్య సాగే ఎమోషనల్ ను చూపించింది. దూరంగా ఉండే వీళ్లిద్దరి మధ్య ఎదురుచూపులని, నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న అనురాగాన్ని తెరపై అద్భుతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ పాటను శ్రేయ ఘోషల్, నకాష్ అజీజ్ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు.
సాయి పల్లవి, నాగ చైతన్య కెమిస్ట్రీ ఈ పాటలో అద్భుతంగా ఉంది. నాగ చైతన్య రగ్గడ్ లుక్ లో అదరగొట్టారు, సాయి పల్లవి ఎలిగెంట్ గా తన క్లాసిక్ డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. అద్భుతమైన విజువల్స్, వోకల్స్, కంపోజిషన్ తో ఈ పాట బ్లాక్ బస్టర్ లవ్ సాంగ్ గా నిలిచింది.
Time stands still to witness Raju-Satya's love ❤️#Thandel Third Single #HilessoHilessa out now ❤️🔥
▶️ https://t.co/pLAmLj7mcO'Rockstar' @ThisIsDSP's blockbuster tune@shreyaghoshal & @AzizNakash's vocals
Lyrics by @ShreeLyricist @Sekharmasteroff's choreography… pic.twitter.com/PQclRc0G7F— Geetha Arts (@GeethaArts) January 23, 2025
టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు, శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీని అద్బుతంగా పనిచేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ,.. స్టూడెంట్ ట్రైబ్ కి థాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. బుజ్జి తల్లి పాటని చాలా పెద్ద హిట్ చేశారు. అది మా టీం అందరికీ చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. హైలెస్సో హైలెస్సా పాట కూడా మిమ్మల్ని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. ఫిబ్రవరి 7 అందరం కలసి థియేటర్స్ లో దుల్లగొట్టేద్దాం అన్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ.. తండేల్ లో చాలా ఎమోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్ వుంటాయి. ముఖ్యంగా ఇందులో అద్భుతమైన ప్రేమకథ వుంది. మీలో వుండే ప్రతి రాజుకి ఇలాంటి బుజ్జితల్లి కావాలనిపిస్తుంది. అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టొరీ. ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చూడకపొతే నా పేరు మార్చుకుంటా అని శపథం చేశారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..స్టూడెంట్స్ ఫ్లాట్ ఫాం పై సినిమాని ప్రమోట్ చేయడం మరవలేనిది. ఈ సినిమాలో నాగచైతన్య నటనతో ఆకట్టుకున్నారు. ఆయన కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుంది. అలాగే తన హయ్యస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.