Suguna Sundari Lyrical Video నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతి హాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహా రెడ్డి సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్యకు పోటిగా దిగుతోంది. అయితే ఈ మూవీ నుంచి వస్తోన్న అప్డేట్లు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఏ చిన్న అప్డేట్ అయినా కూడా చిరంజీవి, బాలయ్యల మధ్య పోల్చి చూస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు.
వీర సింహా రెడ్డి చిత్రం నుంచి మాస్ ఆంథమ్ అంటూ జై బాలయ్య పాటను ఇది వరకే విడుదల చేశారు. ఈ పాట అచ్చం ఒసేయ్ రాములమ్మ పాటకు కాపీలా ఉండటంతో జనాలు ట్రోలింగ్ చేసి వదిలి పెట్టేశారు. తమన్ ఇచ్చిన ఈ కాపీ ట్యూన్‌ను జనాలు తిరస్కరించినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు సుగుణ సుందరి అంటూ బాలయ్య దుమ్ములేపేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook