Hari Hara Veera Mallu Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చారిత్ర చిత్రం 'హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ మూవీని ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'హరి హర వీర మల్లు' చిత్ర పాటల కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి 'మాట వినాలి' అంటూ సాగే ఫస్ట్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేసారు. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడటం విశేషం.
సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే 'మాట వినాలి' లిరికల్ వీడియోతో 'హరి హర వీర మల్లు' సంగీత ప్రయాణం మొదలుపెట్టారు. "వినాలి, వీరమల్లు మాట చెప్తే వినాలి" అంటూ తెలంగాణ మాండలికంలో పవన్ కళ్యాణ్ చెప్పే హృద్యమైన పంక్తులతో సాంగ్ ఎంతో అట్రాక్టివ్ గా ఉంది. ఇది చార్ట్ బస్టర్ గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జానపద బాణీలతో కూడిన పాట వినసొంపుగా ఉంది.
పెంచల్ దాస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. మంచి మాటలను వినడం, వాటి నుండి వచ్చే జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అద్భుతమైన సందేశంతో ఈ పాట లిరికల్ ఉంది. ప్రతి వాక్యం విలువైన జీవిత పాఠాలను అందిస్తుంది. జీవితంలో సానుకూలతతో పాటు ధర్మాన్ని స్వీకరించడానికి శ్రోతలను ప్రోత్సహించేలా ఉంది సాంగ్.
అటవీ నేపథ్యంలో చిత్రీకరించిన 'మాట వినాలి' పాట విజువల్స్ బాగున్నాయి. అడవిలో మంట చుట్టూ వీరమల్లు అనుచరుల బృందం గుమిగూడినట్లుగా లిరికల్ వీడియోలో చూపించారు. ఇక పవన్ కళ్యాణ్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ లు పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ మనోహరమైన, ఆకర్షణీయమైన గీతం సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం పక్కా అని చెప్పొచ్చు. ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా ఆలపించి ఈ పాటకే వన్నె తెచ్చారు. తన గాత్రంతో మొదటి నుండి చివరి వరకు శ్రోతలను ఆకట్టుకునేలా ఈ పాట పాడటం విశేషం. ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత థియేట్రికల్ గా విడుదల కాబోతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
'హరి హర వీరమల్లు' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ సాంగ్ తెలుగులో మాట వినాలి, తమిళంలో కెక్కనుం గురువే, మలయాళంలో కేల్‌క్కనం గురువే, కన్నడలో మాతు కేలయ్యా మరియు హిందీలో బాత్ నీరాలి గా అంటూ అన్ని భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి రిలీజ్ చేయడం విశేషం. కీరవాణి స్వరకల్పనకు తెలుగులో పెంచల్ దాస్, తమిళంలో పి.ఎ. విజయ్, మలయాళంలో మంకొంబు గోపాలకృష్ణన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, హిందీలో అబ్బాస్ టైరేవాలా (ఖుషీ -ఏ మేరా జహా ఫేమ్) సాహిత్యం అందించారు.
హరి హర వీరమల్లు చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తుల్లో నీచుడుగా పేరు తెచ్చుకున్న ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి వారు నటిస్తున్నారు. అణగారిన వర్గాల కోసం అన్యాయంపై పోరాడే యోధుడు కథగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు.
హరి హర వీరమల్లు చిత్రీకరణ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ లో ఉంది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకి లెజెండరీ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, 'బాహుబలి' ఫేమ్ శ్రీనివాస్ మోహన్, హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేస్తున్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.