బాలీవుడ్‌లో సైతం భారీగా విడుదల కానున్న పుష్ప సినిమా

Pushpa Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ రంగంలో కూడా దిగింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2021, 01:30 PM IST
 బాలీవుడ్‌లో సైతం భారీగా విడుదల కానున్న పుష్ప సినిమా

Pushpa Movie: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ రంగంలో కూడా దిగింది.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)హీరోగానే కాకుండా తొలిసారి వైవిద్యమైన మాస్ పాత్రలో కన్పించనున్న పుష్ప సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని శ్రీవల్లి పాట వైరల్ అవుతోంది. గ్రామీణ నేపధ్యంలో సాగే సినిమాలో అల్లు అర్జన్ గంధపు చెక్కల స్మగ్లర్ పాత్ర పోషిస్తున్నాడు. అల వైకుంఠపురం హిట్‌తో అల్లు అర్జున్, రంగస్థలం విజయంతో సుకుమార్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రధానంగా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగం పుష్ప ది రైజ్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. 

పుష్ప సినిమా(Pushpa Movie)హిందీలో విడుదల కాస్త ఆలస్యం కానుందని తొలుత అంచనా వేశారు. అయితే ఇప్పుడు హిందీలో కూడా సినిమా విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. పుష్ప సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ ఫిల్మ్స్ ముందుకొచ్చింది. బాహుబలి 2, కేజీఎఫ్ సినిమాల్ని హిందీలో విడుదల చేసింది ఈ సంస్థనే. పుష్ప సినిమాను కూడా హిందీలో ఇదే సంస్థ విడుదల చేయబోతోంది. 

Also read: బ్రేకింగ్: హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News