VishwakSen Security Guard Salary: టాలీవుడ్ కుర్ర హీరోగా పేరుపొందిన విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరీ నటించగలిగేలా మారిపోయారు. సాధారణంగా హీరోలకు క్రేజ్ స్టార్డం వచ్చిన తర్వాత సెక్యూరిటీ పరంగా చాలామంది బాడీగార్డ్స్ ని నియమించుకుంటూ ఉంటారు.
బాలీవుడ్ హీరోలు ఎక్కువగా వీటిని ఫాలో అవుతూ.. ఉన్నప్పటికీ ఈమధ్య కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వీటిని ఫాలో అవుతున్నారు. తాజాగా విశ్వక్ సేన్ దగ్గర ఉన్న సెక్యూరిటీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారట. వాటి గురించి చూద్దాం.
విశ్వక్ దగ్గర హర్యానాకు చెందిన ఎక్స్ సర్వీస్.. మెన్ రోతాష్ చౌదరి పనిచేస్తూ ఉన్నారట. ఈ రోతాష్ చౌదరి ఏడు అడుగుల హైట్ ఉన్నాడట. సాధారణంగా బ్లాక్ దుస్తులలో చూసి ఇతని అందరూ కూడా కమాండో అనుకుంటూ ఉంటున్నారట. గతంలో కూడా దేశానికి సర్వీస్ అందించిన ఈయన ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత హీరో విశ్వక్సేన్ దగ్గర పని చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ దగ్గర కూడా ఈయన సెక్యూరిటీగా పనిచేశారట.
ఈయన అనుభవాన్ని చూసే విశ్వక్ తన సెక్యూరిటీ ఆఫీసర్గా తనని నియమించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నెలకు విశ్వక్ అతనికి రెండు లక్షల రూపాయలు జీతాన్ని కూడా చెల్లిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక ఫ్లాట్ కూడా ఇచ్చి మరి వారి పిల్లలని కూడా చదివిస్తూ ఉన్నారట.
ఒక రకంగా ఇది కుర్ర హీరోలు ..వ్యక్తిగత భద్రత కోసమే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారా? అనే విధంగా టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. కానీ సైఫ్ అలీ ఖాన్ వంటి స్టార్లు.. ఇంటి బయట వాచ్ మెన్లను పెట్టుకోలేకపోతున్నారు అని సైఫ్ అలీ ఖాన్ ని కొంతమంది విమర్శిస్తున్నారు. మొత్తానికి విశ్వక్ సెక్యూరిటీ విషయాలు కాస్త.. సైఫ్ ని తిట్టేలా చేస్తున్నాయి. మరోపక్క చాలా మంది విశ్వక్ కి ఇంత ఉందా..? ఇంత డబ్బులు పెట్టుకొని అంతటి సెక్యూరిటీని పెట్టుకున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: YS Jagan: 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేనే 30 సంవత్సరాలు ఉంటా!'
Also Read: YS Jagan: వైఎస్ జగన్ కు సీఎం చంద్రబాబు భారీ షాక్.. ఆ కార్యక్రమం రద్దు'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.