Shiva Rajkumar GHOST : డిసెంబర్‌లో ఘోస్ట్ సందడి.. సెట్‌లో శివ రాజ్‌కుమార్ యాక్షన్

Shiva Rajkumar GHOST కన్నడలో వస్తోన్న సినిమాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఘోస్ట్ సినిమాకు ఇప్పుడు నేషనల్ వైడ్‌ క్రేజ్ పెరుగుతోంది. శివ రాజ్ కుమార్ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అయ్యేట్టు కనిపిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2022, 01:02 PM IST
  • కన్నడ ఘోస్ట్ అప్డేట్
  • డిసెంబర్‌లో సెకండ్ షెడ్యూల్
  • రంగంలోకి కన్నడ చక్రవర్తి
Shiva Rajkumar GHOST : డిసెంబర్‌లో ఘోస్ట్ సందడి.. సెట్‌లో శివ రాజ్‌కుమార్ యాక్షన్

Shiva Rajkumar GHOST : కన్నడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ ప్రస్తుతం ఘోస్ట్ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఘోస్ట్ సినిమాను కేవలం కన్నడలోనే కాకుండా మిగతా అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీలో శివ రాజ్ కుమార్ అదరగొట్టేస్తోన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని బీర్బల్ డైరెక్టర్ శ్రీని తెరకెక్కిస్తున్నాడు.

సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నాడు. 28 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ జరిగాయి. ఈ షెడ్యూల్ కోసం దాదాపు ఆరు కోట్లతో అదిరిపోయే జైల్ సెట్ వేశారు. అందులోనే ఎన్నో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసినట్టు తెలుస్తోంది.

ఫస్ట్ షెడ్యూల్ వర్కింగ్ స్టిల్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ మేకింగ్ వీడియోలో నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు వచ్చింది. ఈ మూవీ రెండో షెడ్యూల్‌ను త్వరలోనే ప్రారంభించబోతోన్నారట.

డిసెంబర్ రెండో వారం నుండి రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ షెడ్యుల్ కోసం ప్రిజన్ బయటి లుక్ సెట్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో శివ రాజ్ కుమార్ కొత్త పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ చిత్రంలో జయరామ్, అచ్యుత్ కుమార్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Naga Chaitanya Shobitha Dhulipalla : అడ్డంగా దొరికిపోయిన శోభితా-నాగ చైతన్య?.. ఆడేసుకుంటున్న సమంత ఫ్యాన్స్.. అక్కినేని అభిమానుల మాట ఇదే  

Also Read : Richa Chadha controversy : మా ప్రెసిడెంట్‌కు కోపం తెప్పించిన బాలీవుడ్ నటి.. ఏం ఆడది ఇది?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News