Siddhu Jonnalagadda: ప్రేమికుల రోజుకు టీజే టిల్లు బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ముగ్గురు లవర్లతో వస్తున్నాడు. ఐదేళ్ల కిందట ఓటీటీలో సంచలన విజయం పొందిన తన సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. 'ఇట్స్ కాంప్లికేటెడ్' అనే పేరుతో రానా దగ్గుబాటి నిర్మాణంలో పెద్ద తెరపై సిద్ధూ సందడి చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేశారు. కొత్త అంశాన్ని జోడించి ఈ ట్రైలర్ విడుదల చేసినట్లు సమాచారం.
Also Read: Zee Tv Sa Re Ga Ma Pa: ప్రతిష్టాత్మక వేదికలపై 'జీ సరిగమప' గాయనీలు అద్భుత ప్రదర్శన
రవికాంత్ పెరెపు దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలినితో జోడీగా 'కృష్ణ అండ్ హిస్ లీల' అనే రొమాంటిక్ కామెడీ సినిమా చేసిన విషయం తెలిసిందే. 2020లో కరోనా సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. కరోనా సమయంలో అత్యంత వినోదం ఈ సినిమా అందించింది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భారీగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈసారి పెద్ద స్క్రీన్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.
Also Read: Rana Naidu 2 Teaser: 'రానాని ఓడించేది అతడి తండ్రి ఒక్కడే'.. వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా విడుదల చేయాలని నిర్ణయించగా.. ఈ సినిమాకు పేరు మార్చారు. కొన్ని చిక్కులు ఏర్పడతాయనే ఉద్దేశంతో 'ఇట్స్ కాంప్లికేటెడ్' అని మార్చారు. ఇద్దరు అమ్మాయిలతో రొమాంటిక్ నడుపుతూ మరో యువతితో రిలేషన్ మెయిన్‌టెన్ చేసే పాత్రలో సిద్ధూ కనిపించాడు. అందరికీ తెలిసిన కథ అయినా కూడా కొత్త అంశాన్ని జోడించినట్లు చిత్రబృందం తెలిపింది. ఆ కొత్తదనంతో ఈ సినిమా విడుదల చేయనుండగా.. ఈ సినిమాను రానా దగ్గుబాటి నిర్మించనున్నాడు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ప్రేమికుల దినోత్సవం రోజు లవర్ బాయ్ సిద్ధూ 'ఇట్స్ కాంప్లికేటెడ్'తో వస్తుండడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కామెడీ, రొమాంటిక్‌తో కూడిన ఈ సినిమా విజయం సాధిస్తుందని సురేశ్ ప్రొడక్షన్స్ భావిస్తోంది. ఈ సినిమా అనంతరం మరో సినిమా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సిద్ధూ చేస్తున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter