Singer Sunitha honeymoon plans: సింగర్ సునీత హనీమూన్ ప్లాన్స్

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైన సింగర్ సునీత, రామ్ వీరపనేని జంట ప్రస్తుతం హనీమూన్ ప్లాన్స్‌లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కొత్తగా పెళ్లయిన జంటలన్నీ హనీమూన్ కోసం మాల్దీవ్స్‌కి వెళ్లడం చాలా కామన్ అయ్యింది.

Last Updated : Jan 14, 2021, 05:17 PM IST
Singer Sunitha honeymoon plans: సింగర్ సునీత హనీమూన్ ప్లాన్స్

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైన సింగర్ సునీత, రామ్ వీరపనేని జంట ప్రస్తుతం హనీమూన్ ప్లాన్స్‌లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కొత్తగా పెళ్లయిన జంటలన్నీ హనీమూన్ కోసం మాల్దీవ్స్‌కి వెళ్లడం చాలా కామన్ అయ్యింది. మరి సింగర్ సునీత, రామ్ వీరపనేని జంట కూడా తమ హనీమూన్ డెస్టినేషన్‌ని ఎక్కడ ఎంచుకుంటుందోననే ఆసక్తి ఆమె అభిమానుల్లో కనిపిస్తోంది. 

సింగర్ సునీతకు, రామ్ వీరపనేనికి ఇద్దరికీ ఈ పెళ్లి రెండో పెళ్లి కాగా.. సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. సింగర్ సునీతకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. వాళ్లే ఆమె పెళ్లికి పెద్దలుగా మారారు. తమకు ఎంతో చక్కటి జీవితాన్ని అందించిన తమ తల్లికి కూడా ఓ తోడు ఉంటే బాగుంటుందని భావించిన ఆ అన్నా, చెల్లి ఇద్దరూ ఇలా తమ తల్లిని రెండో పెళ్లికి ఒప్పించి ఈ పెళ్లి జరిపించారని తెలిసిందే. 

ఇదిలావుంటే, సినీ రంగంలో రాణిస్తున్న కొద్దిమంది మహిళామణుల్లో ఒకరిగా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సింగర్ సునీతకు ఫెమినిజం భావాలు ( Feminism ) కూడా ఎక్కువనే సంగతి కూడా తెలిసిందే. అందుకే తన రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎవరు, ఎన్ని కామెంట్స్ చేసినా.. ఆమె వాటిని పట్టించుకోకుండా తన లైఫ్‌లో ముందుకు సాగిపోతున్నారు. ఈ ఆధునిక పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే సింగర్ సునీతలాగే ( Singer Sunitha ) ఉంటాలంటారు ఆమె గురించి బాగా తెలిసి, ఆమెను అభిమానించే వారు.

Also read : Singer Sunitha haldi ceremony photos: సింగర్ సునీత హల్దీ సెరెమనీ ఫోటోలు

సింగర్ సునీతని పెళ్లి ( Singer Sunitha wedding photos ) చేసుకోవడం ద్వారా ఇప్పటివరకు సినీ ప్రముఖులకు మాత్రమే పరిచయం ఉన్న రామ్ వీరపనేని ( Ram Veerapaneni ) కూడా తాజాగా కామన్ పబ్లిక్ అందరికీ సుపరిచితం అయ్యారు. దీంతో ఇకపై రామ్ వీరపనేనిది కూడా పరిచయం అక్కర్లేని పేరేనని అనుకోవాల్సిందే. సినీ ప్రముఖుల సోషల్ మీడియా ఎకౌంట్స్ ప్రమోషన్స్ బాధ్యతలు నిర్వహించే ఓ డిజిటల్ మీడియా కంపెనీకి రామ్ వీరపనేని సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఆయన పూర్తి పేరు రామకృష్ణ వీరపనేని ( Ramakrishna Veerapaneni ).

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News