కొత్త బంగారు లోకం ముద్దుగుమ్మ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఎక్కడా…. అంటూ ఓ ప్రత్యేక స్లాంగ్ తో అందరికీ గుర్తుండిపోయిన శ్వేతాబసు ( Swetha basu ) ఇప్పుడు జీ5 నిర్మిస్తోన్న చిత్రంతో తెరముందుకు వస్తోంది.
కొన్ని విజయాలు..అంతలోనే అపశృతులు. మరికొన్ని దురదృష్టకర సంఘటనలతో చేసింది రెండు మూడు సినిమాలే అయినా అందరికీ గుర్తుండిపోయింది. హిందీ టీవీ సీరియల్స్ నుంచి తెలుగు పరిశ్రమకు తరలివచ్చిన ఈ ముద్దుగుమ్మ కొత్త బంగారులోకంతో అందరికీ పాపులర్ అయింది. ప్రారంభంలో టాలీవుడ్ ను ఊపేసిన శ్వేతా అనంతరం డీలా పడిపోయింది. ఇప్పుడు మళ్లీ నిలదొక్కుకుని నటనపై దృష్టి సారిస్తోంది.
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కాశ్యప్ ( Anurag Kasyap ) వద్ద రైటర్ గా కెరీర్ ప్రారంభించి ప్రేమ వివాహం కూడా చేసుకుంది. ఆ పెళ్లి పెటాకులవడంతో మళ్లీ నిరాశ చెందింది.సీరియల్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ లతో కాలయాపన చేసింది కొంతకాలం. ఇప్పుడు తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ అయిన జీ5 ( Zee5 ) నిర్మిస్తోన్న సినిమాతో ముందుకొస్తోంది.
కామెడీ కపుల్ పేరుతో చిత్రీకరిస్తోన్న ఈ సినిమాలో శ్వేతాబసు మెయిన్ లీడ్ లోనే కన్పించనుంది. పూర్తిగా హాస్యభరితమైన ఈ సినిమాలో శ్వేతాబసు బాగానే నవ్వించనున్నట్టు తెలుస్తోంది. నిచికేత్ సమంత్ దర్శకత్వంలో కొద్దిరోజుల క్రితమే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. బెస్ట్ ఆఫ్ లక్ శ్వేతా...హ్యావ్ ఎ గుడ్ కెరీర్ ఎగైన్. Also read: KTR birthday: కేటీఆర్‌కు చిరు, పలువురు సినీ తారల విషెస్