Teenmar Mallanna: నాగార్జున నువ్వు.. హీరో కాదు.. విలన్‌వి.. రెచ్చిపోయిన తీన్మార్ మల్లన్న.. వీడియో ఇదే..

Konda surekha controversy on chai samantha: మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంతపై చేసిన వ్యాఖ్యలు దుమారం ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 4, 2024, 12:30 PM IST
  • నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న..
  • ఇండస్ట్రీ మీద కూడా ఆగ్రహాం..
Teenmar Mallanna: నాగార్జున నువ్వు..  హీరో కాదు.. విలన్‌వి.. రెచ్చిపోయిన తీన్మార్ మల్లన్న.. వీడియో ఇదే..

Teenmar mallanna hot comments on Nagarjuna over Samantha and chai issue: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంతా డైవర్స్ లపై చేసిన వ్యాఖ్యల దుమారం మాత్రం చల్లబడటంలేదని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో..ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా కొండా సురేఖ వ్యాఖ్యిల్ని ఖండించారు. అంతేకాకుండా.. నాగార్జున, అమలు, నాగచైతన్య, సమంతా, అఖిల్ , జూనియర్ ఎన్టీఆర్, నాని, చిరంజీవి, మహేష్ బాబు, పలువురు డైరెక్టర్లు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒకరి వ్యక్తిగత విషయాలలో లేని పోనీ అభాండాలు వేయడం ఎంత వరకు సమజసమని మండిపడ్డారు. అంతే కాకుండా.. ఒక మంత్రి హోదాలో ఉండి.. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు, కంత్రీర మాటలు మాట్లాడటమేంటని కూడా మండిపడుతున్నారు.

 

కేంద్ర మంత్రులు సైతం ఈ ఘటనపై మాట్లాడారు. అదే విధంగా అక్కినేని నాగార్జున మాత్రం ఈ ఘటనపై చాలా సీరియస్ గా స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధమంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. దీనిపై వెంటనే  కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుని, క్షమాపణ  చెప్పాలని కూడా తెల్చిచెప్పారు. దీనిపై నిన్న కొండా సురేఖ దీనిపై బహిరంగంగా క్షమాపణలు సైతం చెప్పారు.

అయితే.. దీనిపై సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఈ ఘటనకు ఫుల్ స్టాప్ చెప్పాలని కూడా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు. అయిన కూడా ఈ ఘటనపై మాత్రం ట్విట్ ల యుద్దం మాత్రం ఆగడంలేదు. అదే విధంగా అక్కినేని నాగార్జున నిన్న నాంపల్లి కోర్టుకు వెళ్లి కొండా సురేఖ పై పరువు నష్టందావా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎంతదూరమైన వెళ్లేందుకు సిద్దమని నాగార్జున సైతం స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా, ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయని చెప్పుకొవచ్చు.

పూర్తి వివరాలు..
 

వేధిస్తున్నారని కూడా ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఒక మహిళ మంత్రి కాబట్టే.. కాలు దువ్వుతున్నావు కదా..దువ్వు.. నీ సంగతేంటో చూస్తాం బిడ్డా.. అంటూ కూడా మండిపడ్డారు. అదే విధంగా గతంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తే.. ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడలేదని కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో.. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి.  

మరోవైపు నాగార్జున నాంపల్లి కోర్టులో వేసిన పరువు నష్టం పిటిషన్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం మాత్రం చల్లారట్లేదని తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Trending News