TFI meet with CM Update: తెలుగు సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఈ రోజున భేటీ అయ్యారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే ఇబ్బందులను తెలియజేస్తూ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. FDC చైర్మన్‌గా దిల్ రాజు సమక్షంలో.. సినీ సెలబ్రిటీలు, నిర్మాతలు, దర్శకులు సైతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి కొన్ని విషయాల పైన చర్చించినట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం
అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు - ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది అంటే తెలియజేశారు రాఘవేంద్రరావు. అలాగేదిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడం ఆనందంగా ఉందని వెల్లడించారు.. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు చాలానే ఉన్నాయనీ,
గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ను హైదరాబాద్‌లో చేశారు..ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది రాఘవేంద్రరావు.
ఇక నాగార్జున మాట్లాడుతూ..యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని, ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందనీ వెల్లడించారు..హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అంటూ తెలియజేశారు నాగార్జున. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దండి అంటూ తెలియజేశారు.
అలాగే నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ.. ఎలక్షన్స్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుందనీ వెల్లడించారు..సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని,సినిమా రిలీజ్లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారాయి అని సీఎం రేవంత్ రెడ్డి తో వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల..ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నారని తెలిపాడు మురళీమోహన్. సినీ పరిశ్రమను హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలని తెలిపారు శ్యాంప్రసాద్‌రెడ్డి.
దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ..
ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని,
హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్ అని, ప్రభుత్వ సాయంతోనే ఆరోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్‌కి వచ్చిందని తెలిపారు నిర్మాత సురేష్‌బాబు. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు..హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలి అని వెల్లడించారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ..మర్రిచెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చిందని.. తెలియజేశారు..
సీఎం రేవంత్ రెడ్డి ఇలా స్పందిస్తూ..
శాంతిభద్రతల విషయంలో రాజీ లేదు రేవంత్ రెడ్డి..ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామని తెలిపారట.అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని వెల్లడించారు.ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలి..డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి.. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ ప్రతి ఒక్కరూ చేయాలని తెలిపారు.ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని వెల్లడించారు.ప్రభుత్వంకూడా టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి..సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే..తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందన్న సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాను అసెంబ్లీలో చెప్పిన విధంగానే ఇకపై బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం.. ఇండస్ట్రీ పెద్దలకు ఈ విషయం పైన తేల్చి చెబుతూ ఈ విషయంపై మాటకు కట్టుబడి ఉన్నామంటూ తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read: Jr NTR Fan: జూనియర్ ఎన్టీఆర్‌పై విమర్శలపై యూటర్న్.. కౌశిక్ తల్లి వివరణ ఇదే!
Also Read: Dil Raju: సంధ్య థియేటర్ బాధిత రేవతి భర్తకు దిల్ రాజు బంపర్ ఆఫర్.. సినిమా ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.