Thandel: చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన చిత్రం తండేల్. నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఆడియన్స్ ను మెప్పించింది. ముఖ్యంగా లవ్ కమ్ సెంటిమెంట్ ఎమోషన్ దేశ భక్తి చిత్రంగా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాదు చైతూ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలున్నాయి. ఇక ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ చిత్రం రూపుదిద్దుకోవడం వెనక ఓ పాకిస్థాన్ వ్యక్తి ఉన్నాడు. అతను అల్లు అర్జున్ బిగ్ ఫ్యాన్. నిజానికి పాకిస్తాన్ లో చిక్కుకుని కరాచీ జైలులో ఉన్న సమయంలో మన దేశ జాలరులకు ఆ జైలులోని ఒక కానిస్టేబుల్ వారికి సాయం చేసాడు. సినిమాలో కూడా అది అక్కడక్కడ చూపించారు.
అతను అల్లు అర్జున్ పెద్ద అభిమాని. ఈ జాలరులు పాకిస్తాన్ జైలులో ఉన్న సమయంలో వారికి ఎంతో సాయపడుతూ వచ్చాడు ఆ కానిస్టేబుల్. అయితే ఆ జాలరులు రిలీజ్ అవుతున్న సమయంలో ఆ కానిస్టేబుల్ వీరి నుండి ఒక సహాయం అడిగారు. అదేంటంటే మీ దేశంలోని ఐకాన్ సార్ అల్లు అర్జున్ అంటే నాకు ఎంతో ఇష్టం. నేను ఆయన వీరాభిమానిని. నాకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కావాలి. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుని నాకు పంపించండి అని కోరాడు.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
భారతదేశానికి తిరిగి వచ్చిన ఆ జాలరులు కార్తీక్ అనే వ్యక్తికి జరిగిన విషయం అంతా పూస గుచ్చినట్టు చెప్పడంతో అతడు ఎట్టకేలకు ఈ జరిగిన కథ అంతటిని గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థలోని బన్నీ వాసుకు అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కోసం చెప్పడం జరిగింది. తద్వారా జరిగిన స్టోరీని తెలుసుకున్న బన్నీ వాసు ఈ కథపై ఆసక్తి కలిగి జరిగిన పూర్తి కథ ఏమిటో తెలుసుకున్నాడు. దీనిని అందరూ తెలుసుకునే విధంగా ఒక సినిమా తీయాలని అనుకున్నారు. అలా బన్నీ ఫ్యాన్ అయిన కరాచీ జైలులోని ఒక కానిస్టేబుల్ అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ అడగడంతో మొదలై చివరకు ఇప్పుడు జరిగిన ఆ కథ అంతా తండేల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అంతేకాదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతూనే ఉంది.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.