Director Srikanth Addala: కొత్త హీరోను పరిచయం చేయనున్న శ్రీకాంత్ అడ్డాల!

Srikanth Addala: 'నారప్ప'తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల..తన తదుపరి చిత్రం కొత్త హీరోతో చేయనున్నట్లు తెలుస్తోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 10, 2022, 02:48 PM IST
Director Srikanth Addala: కొత్త హీరోను పరిచయం చేయనున్న శ్రీకాంత్ అడ్డాల!

Director Srikanth Addala new Project: 'కొత్త బంగారులోకం', సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల (Director Srikanth Addala). ఇటీవల ఆయన సీనియర్ నటుడు వెంకటేష్ తో 'నారప్ప' (Narappa Movie) సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిలిం వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది. అయితే ఇప్పుడు ఆయన ఓ కొత్త హీరోను తెలుగు తెరకు పరిచయం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, తన బావమరిదిని హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాడట. ఆ ప్రాజెక్టును శ్రీకాంత్ అడ్డాలకి అప్పగించినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా కొత్త అమ్మాయినే తీసుకోనున్నారని తెలిసింది. ఈ సినిమా ఫిబ్రవరిలోగానీ .. మార్చిలోగాని సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన బౌండెడ్  స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట శ్రీకాంత్ అడ్డాల. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. 

Also Read: Samantha: ఛాలెంజింగ్ నెగెటివ్ పాత్రలో కన్పించనున్న సమంత

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) ను ‘'ముకుంద’' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసాడు శ్రీకాంత్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తెరకెక్కించడంలో శ్రీకాంత్ ది అందవేసిన చేయి. శ్రీకాంత్ సినిమాలు అంటే అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడుతుంది.  అయితే ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేసిన 'బ్రహ్మోత్సవం' సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ సినిమా తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. నారప్ప విజయంతో..ఆయన మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News