Aadi Keshava: వెండితెరపై డిజాస్టర్ల పరంపర..బుల్లితెరపై మాత్రం బ్లాక్ బస్టర్ సాధించిన మెగా కాంపౌండ్ హీరో!

Vishnav Tej: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో వైష్ణవ తేజ్. ప్రస్తుతం వరస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో సినిమా బుల్లితెరపై మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2024, 09:58 AM IST
Aadi Keshava: వెండితెరపై డిజాస్టర్ల పరంపర..బుల్లితెరపై మాత్రం బ్లాక్ బస్టర్ సాధించిన మెగా కాంపౌండ్ హీరో!

Sreeleela: వైష్ణవి తేజ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా ఈ మధ్య విడుదలై డిజాస్టర్ గా మిగిలిన సినిమా ఆదికేశవ. కనీస అంచనాలు కూడా లేకుండా విడుదలైన ఈ చిత్రం అలానే కనీసం ఒక పది శాతం మంది కూడా థియేటర్స్ కి వెళ్లకుండా రన్ ముగించుకొని అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

ముందు నుంచి ఈ సినిమాకి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం ఆ తరువాత విరుదల తేదీ కరెక్ట్ గా సెట్ కాకపోవడం.. దానికి తోడు ఈ చిత్రంపై అంచనాలు అస్సలు లేకపోవడం. ఇక వీటితో చాలకుండా ఈ చిత్రం కథ పరమ రోటిన్ గా ఉండడం. ఇలా అనేక సమస్యలతో బాధపడి ఈ చిత్రం ఎలాగోలా థియేటర్స్ లో విడుదలై ఫైనల్ గా డిజాస్టర్ ని చవిచూసింది. స్లాపుల పరంపర నడుస్తున్న వైష్ణవ తేజ్ కెరియర్లో మరో ఫ్లాప్ ని తెచ్చిపెట్టింది. ఉప్పెన చిత్రం తర్వాత వైష్ణవ్ కి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు.  కోవిడ్ లాక్ డౌన్ అవ్వగానే వచ్చిన వైష్ణవ మొదటి సినిమా ఉప్పెన సెన్సేషనల్ హిట్ సాధించింది.. ఆ తరువాత ఈ మెగా హీరో స్టార్ హీరోగా ఎదుగుతారు అని అందరూ అనుకుంటుండగా వరస ఫ్లాపులు తెచ్చుకొని మెగా అభిమానులను నిరాశపరిచారు. కొండపొలం, రంగ రంగ వైభవంగా రెండు సినిమాలు కూడా డిజాస్టర్స్ గా మిగిలాయి. ఆ చిత్రాలు చూసి షాక్ కి గురైన ప్రేక్షకులకు ఆదికేశవ సినిమా మరో తీవ్ర షాక్ గా మిగిలింది. పాత చింతకాయ పచ్చడి ఇలాంటి కథతో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.

అంతేకాదు ఈ చిత్రంలోని కథ, ఈ చిత్రంలోని సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్‌గా మారాయి. హీరో అతి సీన్స్, హీరోయిన్ పాత్ర.. సినిమాలో అవసరం లేని లాజిక్లు, ఫైట్లు.. నవ్వు తెప్పించలేని కామెడీ, పాత ఫార్మాట్ విలనిజం ఇలా అన్ని రకాలుగా ఆదికేశవను నెటిజన్లు ఏకిపారేశారు. ఇంకా 80, 90వ దశకంలో ఉన్నామని అనుకున్నారా? ఇలాంటి సినిమాను థియేటర్లో ఎవరు చూస్తారంటూ ఈ చిత్రాన్ని అత్యంత దారుణంగా ట్రోల్ చేశారు. 

కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇలా థియేటర్స్ లో, ఓటీటీలోనూ డిజాస్టర్ అయినా ఈ చిత్రం బుల్లితెరపై వండర్లు క్రియేట్ చేసిందని తెలుస్తోంది. గత వారం ఈ  సినిమాని మొదటి సారిగా స్టార్ మాలో ప్రచారం చేయగా ఈ సినిమాకి సూపర్ టిఆర్పి రేటింగ్ వచ్చిందంట. ఉప్పెనకు మొదటి సారిగా 18.5 రేటింగ్ రాగా..  వైష్ణవ తేజ్ సినిమా రంగరంగ వైభవంగా మూవీకి అత్యంత తక్కువగా 5.35 టిఆర్పి వచ్చింది. అయితే ఈ ఆదికేశవ మూవీకి మాత్రం 10.47 రేటింగ్ వచ్చిందట. ఇంతటి ఫ్లాప్ మూవీకి ఈ రేంజ్‌లో రేటింగ్ రావడం అంటే మామూలు విషయం కాదని నెటిజన్లంతా షాక్ అవుతున్నారు.

సూపర్ హిట్లుగా నిలిచిన దసరా సినిమాకు 4.99, వాల్తేరు వీరయ్య సినిమాకు సైతం 5.14 రేటింగ్ మాత్రమే వచ్చింది. అంతేకాదు ఆదిపురుష్‌కి 9.47, భగవంత్ కేసరికి 9.36, స్కందకు 8.11 రేటింగ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలను దాటి ఆదికేశవ టిఆర్పి సొంతం చేసుకోవడంతో.. వెండి తెర పై డిజాస్టర్ల పరంపర కొనసాగిస్తున్న  మెగా హీరో బుల్లితెరపై మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశారు అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఇక్కడ కూడా క్రెడిట్ వైష్ణవ్ కి ఇవ్వకుండా.. ఈ సినిమాకి ఇంతటి టిఆర్పి రావడానికి కారణం శ్రీలీల అయిందచ్చని.. ఈ ఘోరమైన చిత్రం ఎలా తీయేటర్స్ లో చూడలేం కాబట్టి.. ఆమె అభిమానులు టీవీలో చూసి ఉండొచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.

Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..

Read More: Praveen IPS: విడుదలైన ప్రవీణ్ ఐపిఎస్ ట్రైలర్.. ఫిబ్రవరి 16న థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News