Varun Tej: ఆడవాళ్ళకి సెలవు..మేమే వంటలు చేస్తాం..మెగా ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన వరుణ్..

Mega Family Secrets: మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు మెగా హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ హీరో మెగా ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2024, 06:07 PM IST
Varun Tej: ఆడవాళ్ళకి సెలవు..మేమే వంటలు చేస్తాం..మెగా ఫ్యామిలీ సీక్రెట్స్ బయటపెట్టిన వరుణ్..

Operation Valentine: కంచె..ఫిదా లాంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న వరుణ్ తేజ్ కి ప్రస్తుతం మాత్రం వరస ఫ్లాపులు వస్తున్నాయి. గని చిత్రం తర్వాత నుంచి వరుణ్ సినిమాలు అన్నీ డిజాస్టర్స్ గా మిగిలాయి. ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ రాబోయే సినిమా ఆపరేషన్ వాలంటైన్ మీదే పెట్టుకున్నారు ఈ హీరో. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా చురుకుగా పాల్గొంటున్నారు.

తెలుగులోనే కాదు హిందీలో కూడా ఈ సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నాడు మెగా హీరో. ఈ ఇంటర్వ్యూస్ లో భాగంగా కొన్ని మెగా ఫ్యామిలీ సీక్రెట్స్ వరుణ్ బయట పెట్టడంతో అందుకు సంబంధించిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

మెగా ఫ్యామిలీ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా ఒక పండగ వస్తే చాలు మెగా – అల్లు ఫ్యామిలీలు కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. వీరికి సంబంధించిన వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉంటాయి. అందరూ కలిసి వంటలు వండుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ సరదాగా కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్య వరుణ్ తేజ్ పెళ్లిలో అలానే సంక్రాంతి పండుగకి కూడా వీరందరూ ఇలా కనిపించి తెగ ఆకట్టుకున్నారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెగా ఫ్యామిలీ గురించి ఎవ్వరికి తెలియని సీక్రెట్స్ ఏమైనా చెప్పమని యాంకర్ అడగగా.. తాము పండగలు వస్తే అసలు ఏం చేస్తాము అని మెగా ఫ్యామిలీ సీక్రెట్ ని బయటపెట్టారు ఈ హీరో.

‘మా ఫ్యామిలీ మొత్తం పండగల సమయంలో అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తామని తెలిసిందే. అయితే సంక్రాంతి పండగల సమయంలో మా ఇంట్లో లేడీస్ అందరికి సెలవు ఇచ్చేస్తాం. వారందరూ హ్యాపీగా కూర్చో ఉంటే  మేమే వంట చేయడం, పనులు చేయడం లాంటివి చేస్తాము. మొన్న సంక్రాంతికి పండగకు కూడా అలానే చేసాం అంతే కాకుండా సంక్రాంతికి మేము క్రికెట్ ఆడుతూ ఉంటాము. మొత్తం మెగా ఫ్యామిలీలో ఉన్న అందరూ చరణ్, నేను, అకిరా,బన్నీ, వైష్ణవ్ తేజ్, సాయి తేజ్, శిరీష్.. ఇలా అందరం కలిసి రెండు గ్రూప్స్ గా విడిపోయి క్రికెట్ ఆడి ఎంజాయ్ చేస్తాము,’ అని చెప్పుకొచ్చారు ఈ హీరో.

ప్రస్తుతం వరుణ్ చెప్పిన ఈ మాటలు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.

Also Read: Mallu Ravi: తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం.. సంచలనం సృష్టించిన మల్లు రవి రాజీనామా

Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News