Game Changer: రామ్ చరణ్ 2025 కొత్త ఏడాదిని ‘గేమ్ చేంజర్’ మూవీ సక్సెస్ తో షురూ ట్ చేశారు. శంకర్ డైరెక్షన్ లో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో ఇటు మాస్, అటు ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది. ఈ మూవీ మూడు రోజుల్లో దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ మెప్పు పొందుతోన్న గేమ్ చేంజర్ చిత్రాన్ని తాజాగా ఢిల్లీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవ్ ‘గాడ్స్ స్పెషల్ ఏంజెల్స్’లోని చిన్నారులతో కలిసి ప్రత్యేకంగా ఈ సినిమాను చూడటం విశేషం. వీరేంద్ర సచ్‌దేవ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. పిల్లలతో కలిసి ఆయన షోను వీక్షిస్తున్న సమయంలోని ఫొటోలను షేర్ చేశారు.
Celebrated my birthday by taking god’s special angels to watch @ramcharan and @advani_kiara ’s movie Game Changer. The joy in their smiles and their excitement of watching a film on the big screen is a moment I will always cherish. pic.twitter.com/oeOTfmjJC4
— Virendraa Sachdeva (@Virend_Sachdeva) January 12, 2025
‘రామ్ చరణ్, కియారా అద్వానీ యాక్ట్ చేసిన ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని గాడ్స్ స్పెషల్ ఏంజెల్స్‌తో కలిసి చూసినట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవటం ఎంతో హ్యాపీగా ఉందన్నారు. ఆ పిల్లల్లో బిగ్ స్క్రీన్‌పై సినిమాను వీక్షిస్తున్నప్పుడు కలిగిన ఆనందం వర్ణనాతీతం అని వీరేంద్ర సచ్‌దేవ్ పేర్కొన్నారు.
గేమ్ చేంజర్’లో రామ్ చరణ్ పవర్‌ఫుల్ గా చూపించారు దర్శకుడు శంకర్. అద్భుతమైన కథ, యాక్షన్ సీన్స్ మూవీని తెరకెక్కించారు. మాస్టర్ మూవీ మేకర్ శంకర్ డైరెక్షన్‌లో ఆసక్తికరమైన కథాంశం, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, హై ప్రొడక్షన్ వేల్యూస్, ఆకట్టుకునే డైలాగ్స్ భారీ తారాగణంతో ఈ సినిమాను గ్రాండియర్ గా తెరకెక్కించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 10న సంక్రాంతి బరిలో విడుదలైన తొలి చిత్రంగా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ చరణ్ నటించిన ప్యాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని శ్రీమతి దివంగత అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ ఎత్తున నిర్మించారు.
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.