Racharikam Movie Release Date: అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రల్లో సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో రూపొందిన మూవీ రాచరికం. చిల్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈశ్వర్ నిర్మించారు. ఈ నెల 31వ తేదీన గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. రాచరికం టైటిల్‌లోనే ఓ రాయల్టి ఉంటుందని.. ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూపిస్తామా..? అని అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్ సురేష్ పనితనం, డెడికేషన్ ప్రతీ షాట్‌లో కనిపిస్తుందని అన్నారు. రాయలసీమ అంటే ఏంటో ఈ సినిమా చూపిస్తుందని చెప్పారు. జనవరి 31న థియేటర్లలో సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని కోరారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. రాచరికం సినిమాలో తాను నెగిటివ్ రోల్ పోషించానని.. మైఖేల్ తరువాత మళ్లీ ఈ పాత్ర తనను ఎగ్జైట్ చేసినట్లు తెలిపారు. సురేశ్, ఈశ్వర్ అద్భుతంగా తీశారని.. అప్సరా, విజయ్ కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పారు. సంగీతం బాగుందని.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. డైరెక్టర్ సురేశ్ లంకలపల్లి మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం తన టీమ్ ఎంతో సహకరించిందని.. ఆర్టిస్టుందరికీ థ్యాంక్స్ చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. వందల కోట్లతో తీసిన మూవీలా ఉంటుందన్నారు. విజయ్ చాలా డెడికేటెడ్‌గా యాక్ట్ చేశారని.. అప్సరా రాణి మాత్రమే ఈ పాత్రను చేయాలని ముందే ఫిక్స్ అయ్యానని చెప్పారు. విజయ రామరాజు విలనిజం చూసి అంతా షాక్ అవుతారని.. వరుణ్ సందేశ్ పాత్ర అదిరిపోతుందన్నారు.
ప్రొడ్యూసర్ ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ మూవీ బడ్జెట్ పెరిగిపోతున్న ప్రతిసారి తన స్నేహితులు ఎంతో సపోర్ట్‌గా నిలిచారని గుర్తు చేసుకున్నారు. విజయ్ శంకర్ ఎంతో ఒదిగి ఉంటారని.. అప్సరా అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. విజయరామరాజు పర్ఫామెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతారని.. వరుణ్ సందేశ్ చాలా సపోర్ట్ చేశారని అన్నారు. అందరూ సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. అప్సరా రాణి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో మూవీలో ఇంత మంచి పాత్రను తనకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఒకే రకమైన పాత్రలు వస్తున్నాయని సినిమాలు వదిలేద్దామని అనుకున్న సమయంలో తనకు ఈ క్యారెక్టర్ లభించిందన్నారు. విజయ్ శంకర్‌తో కలిసి యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని అన్నారు.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. రాచరికం సినిమాను చాలా ప్రొఫెషనల్‌గా తీశారని.. కొత్త టీమ్ తీసిన చిత్రంలా అనిపించలేదని అన్నారు. చాలా పెద్ద మూవీ కాబోతోందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ వెంగి తనను ఇండస్ట్రీకి పరిచయం చేశారని.. ఆయనే తనకు దారి చూపించారని గుర్తు చేసుకున్నారు.
Also Read: Thopudurthi Prakash Reddy: రైలు పట్టాలపై శవమై తేలిన యువకుడు.. హత్యపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి