Devendra Fasnaviss about Modi: జి మీడియా ఎప్పటికప్పుడు ఎన్నో విన్నతమైన ప్రోగ్రామ్స్ అందించే సంగతి అందరికీ తెలిసిన విషయమే. వినోదాత్మకమైనవే కాదు.. సందేశాత్మకమైనవి.. అంతేకాకుండా అందరిని ఉత్తేజ పరిచే లాంటి కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటుంది జి. ఈ నేపథ్యంలో ఈ మధ్యనే జీ మీడియా వారు.. జి రియల్ హీరోస్ 2024 అవార్డ్ ఫంక్షన్ను జరిపారు. ఈ వేదుకకు సినీ నటులతో పాటు ఎందరో రాజకీయ సెలబ్రెటీస్ కూడా హాజరయ్యారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరై కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భారత రాజకీయ రంగంలో ప్రముఖ నాయకులలో ఒకరు. మహారాష్ట్రలో.. పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన ఘనత కలిగిన.. అత్యంత తక్కువ మంది ముఖ్యమంత్రులలో ఒకరిగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ నుండి తరచుగా ప్రశంసలు అందుకుంటూ వచ్చిన ఆయన తాజాగా ముంబైలో జరిగిన ‘జీ రియల్ హీరోస్ అవార్డ్స్ 2024’లో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, ప్రధాని మోదీకి వారసులుగా యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ వంటి నాయకుల పేర్లతో పాటు తన పేరు కూడా ప్రచారంలో ఉందని ప్రశ్నించగా, ఆయన “నేను మోదీ సిద్ధాంతానికి వారసుడిని మాత్రమే” అని అన్నారు.
ఫడ్నవీస్ మాట్లాడుతూ తన నాయకత్వాన్ని ప్రధాని మోదీ మార్గదర్శకత్వం ప్రేరణగా పొందిందని తెలిపారు. మోదీ సిద్ధాంతాలు దేశాభివృద్ధికి నూతన దిశగా తీసుకెళ్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, భారతీయ రాజకీయాల్లో జాతీయత, అభివృద్ధి, సుస్థిరతపై దృష్టి పెట్టడం మోదీ ఇచ్చిన స్ఫూర్తి అని అన్నారు.
ఈ ఇంటర్వ్యూలో మహారాష్ట్ర అభివృద్ధి, రాజకీయ విభజనలు, దేశ భవిష్యత్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మోదీ స్ఫూర్తితో ముందుకు సాగుతానని, దేశసేవకు తన కృషిని కొనసాగిస్తానని తెలిపారు.
Read more: Ponnam Prabhakar: జాతరలో అలిగిన పొన్నం ప్రభాకర్.. మోకాళ్ల మీద మీడియా సమావేశం.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter