"భరత్ అనే నేను" థియేట్రికల్ ట్రైలర్ విడుదల

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం  ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కైరా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. 

Last Updated : Apr 8, 2018, 04:09 PM IST
"భరత్ అనే నేను" థియేట్రికల్ ట్రైలర్ విడుదల

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం  ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కైరా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇదే ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి దాన్ని కరెక్ట్‌ చేయడానికి ట్రై చేస్తే, నీకు రాచరికం, రాజులూ గుర్తొచ్చారు.

కానీ, నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన మా అమ్మా, నాన్న గుర్తొచ్చారు’  అని మహేష్ బాబు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కావడం విశేషం. "భరత్ అనే నేను" చిత్రం ఏప్రిల్ 20వ తేదిన విడుదల కాబోతోంది. శరత్‌ కుమార్, ప్రకాష్ రాజ్‌, దేవరాజ్‌, పోసాని కృష్ణమురళి తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చిన మహేష్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో 'భరత్‌ అనే నేను' పై అంచనాలు పెరిగాయి. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తున్నారు

Trending News