Atharva Movie Updates: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో మూవీ అంటే ఆడియన్స్‌కు ఆసక్తి ఉంటుంది. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లు పడే కష్టాన్ని తెరపై చూపిస్తూ రూపొందిన మూవీ అథర్వ. సస్పెన్స్, క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కినా.. అన్ని రకాల ఎమోషన్స్‌తో డైరెక్టర్ మహేష్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో మంచి బీట్ ఉన్న వీడియో పాటను రిలీజ్ చేశారు. కేసీపీడీ అంటూ సాగే ఈ పాట అదిరిపోవడంతో సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊరి వాతావరణంలో ఎంతో సహజంగా ఈ పాటను రూపొందించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా.. శ్రీ చరణ్ పాకాల బాణీ గాత్రం ఈ పాట వినసొంపుగా ఉంది. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం కట్టిపడేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి