1000 Wala Movie Poster: నూతన నటుడు అమిత్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. యువ దర్శకుడు అఫ్జల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 1000 వాలా. సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ కీలక పాత్రలు పోషించగా.. సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో రూపొందింది. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమాలోని నాలుగు సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రీసెంట్‌గా మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకున్నాయి. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. 1000 వాలా చిత్రం టీజర్ సోషల్ మీడియా ఆడియన్స్‌ను ఆకట్టుకుందన్నారు. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసినట్లు వెల్లడించారు. అంచనాలను మించి తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.
టెక్నీకల్ టీమ్:
==> కథనం, డైలాగ్స్ : గౌస్ ఖాజా
==> కెమెరా: చందు ఏజె
==> ఎడిటింగ్ - డి ఐ : రవితేజ జి
==> కొరియోగ్రఫీ: బాలు మాస్టర్, సూర్య కొలుసు
==> ఫైట్స్: డైనమిక్ మధు
==> మిక్సింగ్: విజన్ స్టూడియోస్
==> సౌండ్ ఇంజనీర్: కలక శ్రీనివాసరావు
==> పబ్లిసిటీ డిజైన్స్: చిత్రలహరి ఎడిట్స్
==> డిజిటల్ ప్రమోషన్స్: S3 మీడియా వర్క్స్
==> మ్యూజిక్: వంశీకాంత్ రేఖాన
==> ప్రొడ్యూసర్: షారుఖ్
==> డైరెక్టర్: అఫ్జల్
Also Read: AP Ministers Ranks: మంత్రుల పనితీరు ర్యాంకులు, పదో స్థానంలో పవన్ కళ్యాణ్
Also Read: School Girl Gang Rape: టీచర్లు కాదు..కీచకులు, విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి