గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. గత రెండు రోజులుగా ఎస్పీ బాలు ఆరోగ్యం క్షీణిస్తోందని (SP Balu Health Condition) ఆయనకు చికిత్స అందిస్తున్న చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయనకు ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఎస్పీ బాలు కుటుంబసభ్యులు, బంధువులు, అత్యంత సన్నిహితులు గురువారం రాత్రి నుంచే ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Also read : SP Balu health bulletin: మరింత క్షీణించిన బాలు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ విడుదల
సింగర్ ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆకాంక్షించారు (Salman Khan Wishes SP Balu Speedy Recovery). ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘బాలసుబ్రహ్మణ్యం సార్, మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నా కోసం పాడిన ప్రతిపాటకు ధన్యవాదాలు. నా కోసం మీరు పాడిన ప్రతి పాట నాకెంతో ప్రత్యేకం. మీ దిల్ దివానా హీరో ప్రేమ్.. లవ్ యూ సర్’ అని సల్మాన్ ఖాన్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. Also read : SPB health condition: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరోసారి తీవ్ర అస్వస్థత
Bala Subramaniam sir . All the strength hope wishes from the bottom of my heart to a speedy recovery n thank u for every song u sang fr me n made special your dil dewana hero prem, Love u sir.
— Salman Khan (@BeingSalmanKhan) September 24, 2020
కాగా, ఆగస్టు తొలి వారంలో ఎస్పీ బాలుకు కరోనా వైరస్ సోకగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. నెల రోజుల తర్వాత ఆయనకు కరోనా నెగటివ్ అని వచ్చింది. అయితే ఆరోగ్యం సహకరించడం లేదని ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల కిందట బాలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి అభిమానులు సంతోషపడ్డారు. కానీ అంతలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. Hyderabad RTC Bus Services: హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం
ఫొటో గ్యాలరీలు
-
నటి అన్వేషి జైన్ బ్యూటిఫుల్ ఫొటోస్
-
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
- Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe