Miheeka Bajaj | టాలీవుడ్లో ఇది పెళ్లిళ్ల సీజన్‌గా కనిపిస్తోంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న హీరోలు నితిన్, నిఖిల్‌లు నిశ్ఛితార్థం చేసుకుని పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. లాక్డౌన్ కారణంగా వీరి పెళ్లిళ్లు వాయిదా పడగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి వంతు టాలీవుడ్ ‘భళ్లాలదేవుడు’ దగ్గుబాటి వారబ్బాయి రానా వంతు వచ్చింది. Photos: నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు
మిహికా బజాజ్ తనకు ఓకే చెప్పిందని, పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు రానా. సోషల్ మీడియాలో మిహికాతో కలిసి దిగిన సెల్ఫీని సైతం పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని ఫాలోయర్లతో షేర్ చేసుకున్నాడు. ఇక అది మొదలుకుని టాలీవుడ్ నుంచి రానాకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రానాకు అభినందనలు తెలిపగా, ఇతర సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా విషెస్ తెలిపారు. ఈ వయసులో పెళ్లి అవసరమా.. శ్రీరెడ్డి రచ్చ రంబోలా!
ప్రస్తుతం జరుగుతున్న చర్చంతా రానాకు కాబోయే భార్య మిహికా బజాజ్ ఎవరు, ఆమె నేపథ్యం ఏంటని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చింది మిహికా బజాజ్. బంటీ, సురేష్ బజాజ్‌లు ఆమె తల్లిదండ్రులు. చెల్సియా యూనివర్సిటీలో ఆమె ఇంటీరియల్ డిజైనింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఇంటీరియర్ డిజైన్ లెబుల్ & ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డేవ్ డ్రాప్ డిజైన్ స్టూడియో వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. దిల్ రాజు పెళ్లిపై కూతురు ఏమన్నారంటే!
మిహికా తల్లి బంటీ బజాజ్ ఓ జ్యువెలరీ బ్రాండ్‌కు డైరెక్టర్ అండ్ క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలతోనూ మిహికాకు అనుబంధం ఉంది. సోనమ్ కపూర్ పెళ్లిలో తళుక్కున మెరిసింది. మిహికా సోదరుడు సమర్థ్ బజాబ్ ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రావల్ సోదరి సాషా రావల్ బజాజ్‌ను వివాహం చేసుకున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!