భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే చావడం ఖాయం: సైఫ్ వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి.

Last Updated : Jul 16, 2018, 09:13 PM IST
భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే చావడం ఖాయం: సైఫ్ వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. భారత్‌లో కులం కానివారితో డేటింగ్ చేసినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా చావడం ఖాయం. ఎవరో ఒకరు చంపేస్తారు' అని సైఫ్ మాట్లాడటంపై పలువురు రాజకీయ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా దేశంలో తొలి నెట్‌ఫ్లిక్స్‌ షో సీక్రెడ్ గేమ్స్‌లో మితిమీరిన శృంగారం, హింస ఉందని చెలరేగిన వివాదాలపై స్పందిస్తూ సైఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌లో అన్నీ భాషల సినిమాలకు తోడు వీళ్ళు రూపొందిస్తున్న వెబ్‌సిరీస్‌లకు యూత్‌లో బాగా క్రేజ్ ఉంది. శ్రుతిమించిన శృంగార దృశ్యాలు, సెన్సార్ కట్లు లేని మాటలు వాటిల్లో వుండటమే అందుకు కారణం. నయాట్రెండ్, గందీబాత్, లస్ట్ స్టోరీస్, సీక్రెడ్ గేమ్స్ వంటి వెబ్‌సిరీస్‌లకు ఆదరణ బాగుంది. 'సీక్రెడ్ గేమ్స్'షోలో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే వంటి వారు నటించగా, అనురాగ్ కాశ్యప్ దర్శకత్వం వహించాడు.

కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చిత్రీకరించినందుకు/వర్ణించినందుకు  సీక్రెడ్ గేమ్స్ షోపై  పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ శనివారం మాట్లాడుతూ.. తన తండ్రి దేశంలో నివసించారని, దేశానికి సేవ చేసి మరణించారని అన్నారు. ఏ వెబ్ సిరీస్ అయినా ఒక పాత్ర యొక్క అభిప్రాయాలను మార్చరాదని అన్నారు. దీనిపై షో క్రియేటివ్ టీం, సహా దర్శకుడు అనురాగ్ కాశ్యప్ రాహుల్ గాంధీ ప్రకటనను స్వాగతించారు.

కాగా.. సీక్రెడ్ గేమ్స్ షో రివ్యూ అగ్రిగేటర్ సైట్ రాటెన్ టొమాటోస్‌లో 86% రేటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు పొందింది.

Trending News