7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి రావల్సిన డీఏ పెంపుపై ప్రకటన వెలువడాల్సి ఉంది. వచ్చే నెల DA పెంపుపై కీలక ప్రకటన వెలువడవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం హోళి కానుక అందించేందుకు సిద్దమైంది. ఉద్యోగుల జీతాలతో పాటు డీఏ పెంపుపై కూడా కీలక ప్రకటన వెలువడనుంది. డియర్‌నెస్ అలవెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల కీలక ప్రకటన జారీ చేయవచ్చు. హోళీ పురస్కరించుకుని డీఏ పెంపు ప్రకటన చేయనుంది. మార్చ్ నెలలో డీఏ పెంపును 4 శాతం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం డీఏ 46 శాతం వస్తుండగా, 4 శాతం పెరిగితే డీఏ 50 శాతానికి చేరుకోనుంది. నిబంధన ప్రకారం డీఏ ఎప్పుడైతే 50 శాతానికి చేరుకుంటుందో ఆ డీఏ మొత్తాన్ని బేసిక్ శాలరీకు కలపాల్సి ఉంటుంది. అంటే రూ.18 వేలు కనీస వేతనం ఉన్నవారికి మార్చ్ నెల నుంచి జీతం 9 వేలు పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఏడాదికి రెండుసార్లు పెంచుతుంటారు. మొదటిది జనవరిలో, రెండవది జూలై నెలలో ఉంటుంది. మొదటిది అంటే జనవరి నెలలో పెంచాల్సిన డీఏ ప్రకటన మార్చ్ నెలలో ఉంటుంది. హోళీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు కానుక అందించనుంది. అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
గత ఏడాది అంటే 2023 అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 4 శాతం పెరిగింది. దాంతో 42 శాతం ఉన్న డీఏ 46 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణం రేటు ప్రకారం ప్రభుత్వం ఈసారి కూడా 4 శాతం డీఏ పెంచేందుకు యోచిస్తోంది. మార్చ్ నెలలో ప్రకటన వెలువడినా జనవరి నుంచి అమలు కానుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా డీఏ పెంపు నిర్ణయం ఉంటుంది. ఈ జాబితా ప్రకారం 12 నెలల సరాసరి 392.83 ఉండటంతో డీఏ 50.26 శాతం ఉంది.
Also read: Mahasena Rajesh: పి గన్నవరం నుంచి మహాసేన రాజేశ్ అవుట్, పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter