Why walnuts soaked: గింజలను ఎక్కువశాతం మామూలుగా తినడం కంటే నానబెట్టి తినాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. దీనికి అసలైన కారణాలు చాలా ఉన్నాయి.గింజలు అంటే జీడిపప్పు బాదం వాల్ నట్స్ నానబెట్టి తినాలని అంటారు దానికి అసలైన కారణం ఏంటో తెలుసుకుందాం.
వాల్నట్స్ లో పాలిఫనల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. అంతేకాదు ఇది దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుతుంది. అంతేకాదు ఇది మంచి బ్రెయిన్ ఫుడ్ గా కూడా పరిగణిస్తారు వాల్నట్స్ అక్రోట్లు అని కూడా పిలుస్తారు. వీటి షెల్స్ భాగం గట్టిగా ఉంటుంది. మార్కెట్లో షేల్స్ తో పాటు షెల్స్ లేనివి కూడా విక్రయిస్తారు.వాల్నట్స్ సూపర్ మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. వైద్యులు వాల్నట్స్ తినే మందు నానబెట్టి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి అని అంటారు. వాటితో ఏ లాభాలు ఉంటాయో తెలుసుకుందాం.
వాల్నట్స్ మాత్రమే కాదు ఇతర గింజలను కూడా నానబెట్టి తినడం వల్ల కాలు పుష్కలంగా లభిస్తాయి అంతేకాదు సులభంగా జీర్ణం కూడా అవుతుంది. ఇలా వాల్ నట్స్ తినడం వల్ల ఇందులో ఉండే ఎంజైమ్స్ జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తాయి .పడుకునే ముందు వాల్నట్స్ను నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక మలబద్దక సమస్యలకు కూడా చెప్పేటోచ్చు.
ఇదీ చదవండి: ప్రతిరోజు తులసి టీ తాగితే కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు..
వాల్నట్స్ మాత్రమే కాదు వాల్నట్స్ నానబెట్టిన నీటిలో కూడా పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు వాల్నట్స్ రుచి పరంగా చూస్తే కాస్త చేదుగా ఉంటుంది. ఇలా వాల్నట్స్ ను నానబెట్టి తీసుకోవడం వల్ల చేదు తగ్గుతుంది. కొందరికి పచ్చిగా ఉన్న వాల్నట్స్ తినడం వల్ల కడుపు సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల పెద్దగా ప్రభావం ఉండదు.
ఇదీ చదవండి: కొబ్బరినీటి కంటే అందులోని లేతకొబ్బరి ఆరోగ్యమంట.. వేసవిలో మరింత ఆరోగ్యకరం..!
వాల్నట్స్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో సమస్య రాకుండా ఉంటుంది ఇందులో కాల్షియం జింకు కూడా ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళలు వాల్నట్స్ కచ్చితంగా తినాలి. అంతే కాదు పోషకాహార లోపంతో బాధపడే వారు కూడా డైట్ లో చేర్చుకుంటే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.వీటిని మామూలు నీటిలో కంటే ఉప్పు వేసిన నానపెడితే అందులో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది.
వాల్నట్స్ నేరుగా తినవచ్చు లేదా స్మూతీ, సాస్ జ్యూస్ల రూపంలో కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా వాల్నట్స్లో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఇవి కొలెస్ట్రాల స్థాయిలను తగ్గిస్తాయి చెడు కొలెస్ట్రాలను చెక్ పెడతా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కాపర్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి ఇందులోని ఆల్ఫా లినోలిక్ యాసిడ్ శరీరంలో మంటను తగ్గించే లక్షణాలు కలిగి ఉన్నాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook