Bad Habits That Can Affect Liver: మనం ప్రతిరోజు పొట్ట గుండె ఊపిరితిత్తులు వంటి అవయవాలపై దృష్టి పెట్టినప్పటికీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. అతి ముఖ్యమైన కాలేయంపై మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కొంతమంది అయితే ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవడం కూడా మానుకుంటున్నారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అవయవాలు కూడా హెల్తీగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది అనారోగ్యం పాలయ్య అలవాట్లలో మునిగిపోయారు. వాటిని ప్రతిరోజు అదే పనిగా చేయడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని.. దీంతో కాలేయం చెడిపోతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం వల్లే కాలయం కూడా ఆరోగ్యంగా ఉంటుందని.. ప్రతిరోజు తీసుకునే ఆహారల్లో తప్పకుండా ఆరోగ్యకరమైన పౌష్టికమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. హెల్తీ లివర్ కోసం రెడ్ మీట్, చేపలు కూడా తీసుకోవాలి. అయితే మద్యపానం ధూమపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు చేసే మూడు చెడు అలవాట్ల కారణంగానే కాలేయం చెడిపోతుందని వీటిని ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది.
1. పగటిపూట నిద్రపోయే అలవాటు:
ప్రస్తుతం చాలామంది పగటిపూట నిద్రపోతున్నారు. ఇలా చేయడం వల్ల రకాల అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. 10 నుండి 20 నిమిషాల పవర్ న్యాప్ తీసుకోవడం వల్ల ఎటువంటి హాని ఉండదు. కానీ నిద్రపోవడం వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
2. రాత్రి లేటుగా నిద్రపోవడం:
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది అర్ధరాత్రి వరకు మొబైల్ చూస్తూ నిద్రపోక మేల్కొని ఉంటున్నారు. దీనివల్ల ఉదయం లేటు లేవడం సులభంగా అలసిపోవడం.. ఇంకొందరిలోనైతే దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆలయాన్ని హెల్తీగా ఉంచుకోవడానికి సరైన సమయంలో నిద్ర పోవడం చాలా మంచిది.
3. ఎక్కువ కోపం:
మన కోపాన్ని నియంత్రించుకోవడం మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాదు, శరీరంలో ఉండే కాలేయానికి కూడా చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎంత వీలైతే అంత కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. లేకపోతే ఒత్తిడి సమస్యలతో పాటు కాలేయ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..
Also Read: Smita Sabharwal: సీఎంవో అధికారిని స్మితా సబర్వాల్ ఇంట్లోకి దూరిన డిప్యూటీ తహసీల్దార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook