/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

Banana Shake Secrets: రోజు ఒక అరటి పండు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన ఫైబర్‌తో పాటు పొటాషియం అధికంగా ఉంటుంది. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడుతన్నవారికి వైద్యులు ప్రతి రోజు ఒక అరటి పండు తినమని సూచిస్తారు. ఇదిలా ఉంటే రోజు ఉదయం అరటి పండు కంటే నేరుగా తినడం కంటే షేక్‌ తాగడం వల్ల రెట్టింపు లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి శక్తిని అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా సహాయపడుతుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 

బనానా షేక్‌ తాగడం వల్ల కలిగే లాభాలు:
ఎనర్జీ బూస్ట్: 

బనానాల్లో పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అద్భుతమైన శక్తిని అందిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే వ్యాయామాలు చేసేవారు రోజు ఉదయం, మధ్యాహ్నం తినడం వల్ల అలసట వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా తక్షణ శక్తి కూడా కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

జీర్ణక్రియ మెరుగుపరచడానికి:
బనానాల్లో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రోజు తినడం వల్ల జీర్ణక్రియను మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ షేక్‌ ప్రతి రోజు తాగితే మలబద్ధకంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. 

మూడ్ స్థాయిలను మెరుగుపరచడం: 
బనానాల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీని కారణంగా మానసిక స్థితిని మెరుగుపడుతుంది. అంతేకాకుండా నిద్రను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

గుండె ఆరోగ్యం: 
బనానాల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

కండరాల పెరుగుదల:
బనానాల్లో పొటాషియం, కార్బోహైడ్రేట్లు కండరాల పెరుగుదలకు, రికవరీకి అవసరమైన పోషకాలను అందిచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే వ్యాయామాలు చేసేవారికి కూడా ఈ షేక్‌ కీలక పాత్ర పోషిస్తుంది. 

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం:
బనానాల్లో కాల్షియం, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు, ఆస్టియోపోరోసిస్ వ్యాధుల బారిన పడకుండా ఎముకలను రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Banana Shake Secrets: Amazing Secrets To Know About Banana Shake dh
News Source: 
Home Title: 

 Banana Shake Secrets: బనానా షేక్‌ గురించి ఇవి తెలుసా? తప్పకుండా తెలుసుకోవాలి..

 Banana Shake Secrets: బనానా షేక్‌ గురించి ఇవి తెలుసా? తప్పకుండా తెలుసుకోవాలి..
Caption: 
source file- zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
బనానా షేక్‌ గురించి ఇవి తెలుసా? తప్పకుండా తెలుసుకోవాలి..
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Thursday, September 5, 2024 - 14:30
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
19
Is Breaking News: 
No
Word Count: 
280