మనలో కొందరు బరువు పెరుగుతున్నామని.. మరికొందరు బరువు పెరగడం లేదని బెంగపడుతుంటారు. శరీర సమతూల్యతను పాటించేందుకు రకరకాల మందులు..రకరకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే దీని కోసం ఒక చిట్కా పాటిస్తే చాలంటున్నారు అమెరికా యూనివర్శిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్రొఫెసర్లు. బాడీ బ్లాలెన్స్ గా ఉంచుకోవాలంటే ఉదయం తీసుకునే టిఫిన్ (అల్పాహారం) పై సీరియస్ గా దృష్టి పెడితే చాలంటున్నారు .
సాధారణంగా ఆఫీసుకు వెళ్లే తొందర్లో టిఫిన్ పై అశ్రద్ధ వహిస్తుంటాం..గృహిణిలు ఉదయం ఇంటి పనుల్లో బిజీగా ఉండటం వల్ల అల్పాహారంపై నిర్లక్ష్యం వహిస్తుంటారు . ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. బాడీ బ్లాలెన్స్ గా ఉంచుకోవడం ఎలా అనే అంశంపై చేసిన అధ్యయనంలో ఉదయం ఆహారం తీసుకునే వారు ఆరోగ్యంగాను.. శరీర సమతూల్యత పాటిస్తున్నట్లు రుజువైంది. అంతే కాదు ఉదయం అల్పాహారంలో భాగంగా సరైన డైట్ తీసుకున్న వారు రోజంతా చురుగ్గా తమ పనులు చేసుకోగలరని పేర్కొన్నారు. ఇలాంటి వారు వృత్తి జీవితంతో పాటు కుటుంబ జీవితంలో విశేషంగా రాణిస్తున్నారని తేలింది. మొత్తం 50 వేల మందిపై అధ్యయనం చేసిన అమెరికాలోని లిండి యునివర్శిటీ ఆఫ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు.