Buttermilk Side Effects: వేసవి వస్తే చాలు. చల్లని పానీయాలకు క్రేజ్ పెరుగుతుంటుంది. ముఖ్యంగా మజ్జిగను ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే కొందరికి మాత్రం మజ్దిగ మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.
వేసవిలో లిక్విడ్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది పండ్లరసాల రూపంలో కావచ్చు, నిమ్మరసం, డ్రింక్స్ రూపంలో కావచ్చు లేదా మజ్జిగ కావచ్చు. ఎందుకంటే శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా ఉంచుకోవడంతో పాటు దాహం తీర్చుకునేందుకు ఇవి దోహదపడతాయి. అయితే ఇందులో కూల్ డ్రింక్స్ తప్ప మిగిలినవి ఆరోగ్యానికి చాలా మంచివే.
ముఖ్యంగా మజ్జిగ చాలా మంచిది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్ , విటమిన్ బి 12, మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేకూర్చే పోషకాలు. ఇందులో ఉండే ప్రో బయోటిక్ లాక్టిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అటు చర్మ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. ముఖంపై వయసు కారణంగా ఏర్పడే ముడతల్ని తగ్గించి యాంటీ ఏజీయింగ్‌లా పనిచేస్తుంది. ఇన్ని గుణాలున్న మజ్జిగ కొందరు వ్యక్తులకు మంచిది కాదని వైద్యలు చెబుతున్నారు. తీసుకుంటే ఆ సమస్య అధికమౌతుందట.
మజ్జిగ ఎవరికి మంచిది కాదు
కీళ్లనొప్పులతో బాధపడేవారు, ఆర్థరైటిస్, కండరాల నొప్పి సమస్య ఉన్నవాళ్లు మజ్జిగ తీసుకోకూడదు. మూత్రపిండాలు, తామర వంటి సమస్యలో ఇబ్బందిపడేవాళ్లు కూడా మజ్జిగ తక్కువగా తీసుకోవాలి. ఇక జలుబు, దగ్గు, గొంతు నొప్పితో సతమతమయ్యేవారు కూడా మజ్జిగ సేవించడం మంచిది కాదు. ఇక జ్వరం ఉన్నప్పుడు చల్లగా, పుల్లగా లేకుండా మజ్జిగ తీసుకోవచ్చు. గుండెజబ్బులున్నవాళ్లు కూడా మజ్జిగను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఎందుకంటే మజ్జిగలో ఉండే ఓ రకమైన కొవ్వు గుండెకు మంచిది కాదు. ముఖానికి మజ్జిగ రాసుకోవడం కూడా మంచిది కాదు.
Also read; Skin Glow With Egg: గుడ్డుతో ముఖం మెరిసిపోతుందా? ఉపయోగించడానికి సరైన పద్ధతులను తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook