వింటర్ స్పెషల్ ఫ్రూట్‌గా మార్కెట్‌లో లభించే సీతాఫలాలకు క్రేజ్ ఎక్కువ. సీతాఫలాలతో పాటు వీటి ఆకులు కూడా ఔషధపరంగా అద్బుతమైనవి. ఇందులో కాల్షియం, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో పాటు చాలా పోషక గుణాలున్నాయి. ఈ ఆకులతో చేసే టీ ఆరోగ్యానికి చాలా మంచిది.
సీతాఫలం ఎంత రుచిగా ఉంటుందో..ఆరోగ్యపరంగా అంత మంచిది. కేవలం సీతాఫలమే కాదు..సీతాఫలం ఆకులు కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. వీటిలో కాల్షియం, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో పాటు ఇతర పోషకాలు చాలా ఉన్నాయి. సీతాఫల ఆకులతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యానికి
సీతాఫలం ఆకులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ ఆకుల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది.
చర్మ సంరక్షణలో
సీతాఫలం ఆకులు ఆరోగ్యానికే కాదు..చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. సీతాఫలం ఆకుల్ని మిక్సర్ చేసి ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే చర్మ సంబంధించ వ్యాధులు దూరమౌతాయి.
డయాబెటిస్ రోగులకు
డయాబెటిస్ రోగులకు సీతాఫలం మంచిది కాదు కానీ..సీతాఫలం ఆకులు మాత్రం చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. ఈ ఆకులతో టీ చేసుకుని తాగితే డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరం. అంతేకాకుండా ఈ ఆకుల టీ తాగితే..శరీరంలో పేరుకుపోయిన విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
Also read: Cholesterol Tips: ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే..రక్త నాళికల్లో ఉండే కొవ్వు కూడా 30 రోజుల్లో మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook