Diabetes Control Food: ప్రస్తుతం భారత దేశంలో నిరంతరం మధుమేహం రోగుల సంఖ్య పెరుగుతోంది. అయితే చాలా మందిలో చలి తీవ్రత కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో పాలు సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే మధుమేహం తీవ్రతరమై ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. అయితే ఈ వ్యాధి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల ఇంటి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల శరీరంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
చలి కాలంలో మధుమేహానికి ఇలా చెక్ పెట్టండి:
మెంతులు:
మధుమేహంతో బాధపడుతున్నవారికి మెంతులు ప్రభావవంతంగా సహాయపడుతాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల మూలకాలు ఉంటాయి. ఇవి చలికాలంలో రక్తంలోని చక్కెర పరిమాణాలను తగ్గించేందుకు సహాయపడతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మెంతి గింజలను నానబెట్టి తీసుకోవడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నల్ల మిరియాలు:
నల్ల మిరియాల్లో కూడా శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల మధుమేహాన్ని సులభంగా అదుపులో ఉంచవచ్చు. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రించవచ్చు.
దాల్చిన చెక్క:
ఆహారాల రుచిని పెంచడానికి దాల్చిన చెక్క ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఇది ఆహారాల రుచిని పెంచడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ప్రతి రోజూ దాల్చిన చెక్క డికాషన్ తాగితే రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటుంది.
ఆహారం ఇలా ఉండాలి:
మధుమేహాన్ని నియంత్రించడానికి తప్పకుండా ఆహారాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే శీతాకాలంలో ఆహారాలే శరీరానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు అస్సలు అధిక కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాలను తినొద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా
Also Read: Ashu Reddy Hot Photos: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి అందాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.