Lotus Flower Root For Diabetes And Weight Loss: ఆయుర్వేద శాస్త్రంలో అన్ని మూలికల గురించి క్లుప్తంగా వివరించారు. పూర్వకాలంలో ప్రజలంతా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పాడినప్పుడు కేవలం ఆయుర్వేదం ద్వారానే చికిత్స పొందేవారు. ఈ శాస్త్రంలో అనేక రకాలు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన చికిత్స విధానాలు, మూలికలను పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కూడా చాలామంది ఆయుర్వేద శాస్త్రాన్ని నమ్ముకొని వ్యాధులకు చికిత్సలు చేస్తున్నారు. నిజానికి ఈ శాస్త్రంలో జబ్బు పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఆహార పద్ధతుల గురించి కూడా ఎంతో క్లుప్తంగా వివరించారు. అయితే ఈరోజు మనం ఆయుర్వేదంలో తెలిపిన పద్ధతిలో బరువు తగ్గడం, మధుమేహాన్ని నియంత్రించుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధునిక జీవనశైలిలో బరువు పెరగడం సాధారణ సమస్య అయినప్పటికీ, చాలామంది దీని కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 100 మందిలో దాదాపు 35 నుంచి 40 వరకు బరువు పెరగడం కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారే ఉన్నారని ఇటీవలే కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి బరువు పెరగడం కారణంగా సులభంగా బెల్లీ ఫ్యాట్ పెరిగి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా గుండెపోటు, మధుమేహం, అధిక రక్తపోటు క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ లో చాలామంది బరువు పెరిగినవారు ఎదుర్కొంటున్న సమస్యల్లో మధుమేహం ఒకటి. ఈ మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. 30 ఏళ్ల లోపు ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారంటే నమ్మశక్యంగా లేదు.
అయితే బరువు పెరుగుతున్న వారు మధుమేహం ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఆహార పద్ధతులను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆహారాల్లో వారు సూచించిన కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని మీకు మీరే రక్షించుకోవచ్చు. ఆయుర్వేద నిపుణులు సూచించి డైట్ ప్రకారం.. సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ఆహారంలో తామర పువ్వు చెట్టుకు సంబంధించిన వేర్లను వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చని వారంటున్నారు.
తామర పువ్వు వేర్లలో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ఇందులో శరీర బరువును నియంత్రించే ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. దీంతో పాటు పొటాషియం కూడా ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. అలాగే ఈ వేళలో విటమిన్ సి, ఐరన్, ప్రోటీన్స్ అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు డైట్ లో భాగంగా తామర పువ్వు వేర్లతో చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను సులభంగా తగ్గించగలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు మధుమేహాన్ని సులభంగా నియంత్రించుకోవాలనుకునేవారు.. ఈ తామర వేర్లతో తయారుచేసిన పచ్చడిని గోధుమ పిండితో తయారుచేసిన రొట్టెలతో తీసుకోవడం వల్ల రెట్టింపు ఫలితాలు పొందుతారు. అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీర బరువును నియంత్రించడమే, కాకుండా శరీరంపై వచ్చే వాపులను తగ్గించేందుకు కూడా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఇందులో ఉండే మిథనాల్ సారం శరీరంపై ఉన్న వాపులను తగ్గించడమే కాకుండా నొప్పులను కూడా సులభంగా నియంత్రిస్తుంది. తరచుగా శరీరం పై వాపులు ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తామర పువ్వు చెట్టు వేర్లతో చేసిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Diabetes: తామర పువ్వుతో కూడా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.. ఇంకా బరువు సులభంగా తగ్గొచ్చు!