Diet For Diabetes: తరచుగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరుగుతున్నాయా.? ఇలా చేస్తే అవి తగ్గడంతో పాటు మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు..

Diet For Diabetes: ప్రస్తుతం చాలా మంది మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవారు తప్పకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దీర్ఘకాలీ వ్యాధుల బారీన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2023, 08:34 PM IST
 Diet For Diabetes: తరచుగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరుగుతున్నాయా.? ఇలా చేస్తే అవి తగ్గడంతో పాటు మధుమేహానికి చెక్‌ పెట్టొచ్చు..

Diet For Diabetes: చెడు జీవన శైలి కారణంగా చాలా మంది మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో రక్తంలో షుగర్‌ లెవల్స్ కూడా పెరుగుతున్నాయి. అయితే మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు శరీరంపై ఎలాంటి శ్రద్ద వహించడం లేదు. మరికొందరైతే విచ్చల విడిగా మార్కెల్‌లో లభించే స్ట్రీట్‌ ఫుడ్‌ కూడా తింటున్నారు. ఇలా చేయడం వల్ల మధుమేహం తీవ్ర తరమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన చిన్న చిన్న చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. 

వీటిని ఆహారంలో తప్పకుండా తీసుకోండి:

దాల్చిన చెక్క:
దాల్చిన చెక్కలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించే చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గి.. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తగ్గుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఒక టీస్పూన్ దాల్చినచెక్కలో అర టీస్పూన్ పసుపు వేసి కలిపి నీటిలో కలుపుకుని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

బ్లాక్‌ పెప్పర్‌:
బ్లాక్‌ పెప్పర్‌లో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలువతో పాటు ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ఆహారంలో తరచుగా ఆహారంలో వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మెంతి గింజలు:
మెంతి గింజలు తినడానికి చేదుగా ఉన్న ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్నవారికి ఔషధంలా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గింజలను ప్రతి రోజూ నీటిలో నానబెట్టి తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సీజనల్‌ల్లో వచ్చే వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని కాపాడుతుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News