Dolo 650 side effects: డోలో 650.. గత కొంత కాలంగా దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది నిత్యవసర వస్తువుగా మారిపోయింది. దగ్గు, జలుబు, జ్వరం, బాడీ పెయిన్స్ వంటి సమస్యలు వస్తే.. డోలో వేసుకోవడం సాధారణమైపోయింది. ఇంకా చెప్పాలంటే.. డాక్టర్ సలహా అవసరం లేకుండానే చాలా మంది దీనిని (Dolo 650 Usage) వాడేస్తున్నారు.
రెండేళ్లుగా ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. ఈ సమయంలో జ్వరం, ఒళ్లు నొప్పుల వంటివి సర్వ సాధారణమైపోయాయి. దీనితో ప్రతి ఒక్కరి ఇంట్లో డోలో మాత్రలు కచ్చితంగా పెట్టుకుంటున్నారు. చిన్నపాటి నలతగా అనిపించిన.. వైద్యడి సలహా లేకుండనే డోలో 650ని తీసుకుంటున్నారు.
మరి ఇలా అదుపు లేకుండా డోలో 650ని తీసుకోవడం ఎంత వరకు మంచిది? ఈ ఔషధాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? నిజంగానే అన్ని రోగాలకు ఇది పని చేస్తుందా? వైద్యులు (Experts on Dolo 650) ఏమంటున్నారు?
డోలో 650 ఎలా పని చేస్తుంది?
పారాసిటమోల్ ఫార్ములా ద్వారానే డోలోని తయారు చేస్తారు. ఈ ఔషధం జ్వరంతో పాటు కరోనా లక్షణాల్లో చాలా వాటిని నయం చేస్తుది. ఈ కారణంగానే ఎక్కువ మంది దీనిని తీసుకుంటున్నారు.
డోలో-650 అనేది జ్వరం, వెన్ను నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. డాక్టర్ ప్రిష్క్రిప్షన్ లేకుండానే ఈ ట్యాబ్లెట్ లభిస్తుండటంతో దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత విడుదలయ్యే ఔషధం.. నొప్పి సంకేతాలను తగ్గించేలా మెదడును ప్రేరేపిస్తుంది. దీనితో ఆయా వ్యక్తులు ఉపశమనం పొందుతారు.
ఇయితే ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని వివరిస్తున్నారు వైద్య నిపుణులు. ఆవేమిటంటే..
వికారంగా ఉండటం, తల తిరిగినట్లు అనిపించడం, బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. విపరీతమైన నిద్ర, మలబద్ధకం, మూర్చపోయినట్లు అనిపించడం, నోరు త్వరగా తడారిపోవడం వంటివి సాధారణమైన సైడ్ ఎఫెక్ట్స్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..
- గుండె వేగం నెమ్మదించడం లేదా కొన్ని సార్లు విపరీతంగా పెరగటం
- గొంతు భాగంలో వాపు
- ఊపిరితిత్తుల్లో నీరు చేరడం
- ఊపిరి ఆడకపోవడం
- నాడి వ్యవస్థపై తీవ్ర ప్రభావం
Also read: Saunf Side Effects: మీకు ఆ సమస్య ఉందా..అయితే సోంపు తినవద్దు..లేకపోతే కలిగే అనర్ధాలివే
Also read: Tulsi Seeds: కేన్సర్ కణాల్ని సైతం నియంత్రించగలిగే ఆ విత్తనాలేంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook