Walnuts Health Benefits: మనం ప్రతిరోజు తీసుకునే డ్రై ఫ్రూట్స్‌లో వాల్ నట్స్ కూడా ఒకటి. పిల్లలనుంచి పెద్దవారి దాకా చాలామంది ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. వాల్నట్ చూడడానికి మనిషి మెదడును పోలివున్న శరీరానికి అనేక రకాల లాభాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి మొదలుకొని మెదడు సమస్యల వరకు దూరం చేసేందుకు వాల్నట్స్ ఎంతో సహాయపడతాయి. వాల్ నట్స్ ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
వాల్ నట్స్‌లో ప్రోటీన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, రాగితో పాటు సెలినియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతోపాటు శరీరానికి మన మెదడుకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా చాలా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు కూడా మారుతుంది. ముఖ్యంగా పిల్లల్లోని జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఇవి ఎంతో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ వాల్నట్స్ లో ఉండే గుణాలు ఆలోచన శక్తిని పెంపొందించేందుకు కూడా ఎంతో సహాయపడతాయి.
ఇవే కాకుండా వాల్ నట్స్ ను ప్రతిరోజు తినడం వల్ల మెదడులోని కణాలన్నీ చురుకుగా తయారవ్వడమే కాకుండా మతిమరుపు, అల్జీమర్స్ వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. ఇందులో శరీరానికి కావాల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రిస్తుంది. తరచుగా గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల నుంచి రక్షిస్తాయి. ఇవే కాకుండా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధిని సైతం సులభంగా తగ్గించేందుకు వాల్ నట్స్ సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీర బరువును నియంత్రించేందుకు కూడా ఇవి ప్రభావంతంగా సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయం పూట వాల్ నట్స్‌ను నీటిలో నానబెట్టుకొని తీసుకోవడం వల్ల సులభంగా ఫలితాలు పొందుతారు. దీంతోపాటు ఇందులో పొటాషియం లెవెల్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి రక్తపోటు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల గొప్ప ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా స్పెర్మ్ కౌంట్ లెవెల్స్ అని కూడా పెంచేందుకు సహాయపడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి